హోమ్ /వార్తలు /బిజినెస్ /

Penny Stock: రూ.8 షేరుతో కాసుల వర్షం.. 6 నెలల్లో డబ్బు రెట్టింపు, కొంటే మీ పంట పండినట్లే!

Penny Stock: రూ.8 షేరుతో కాసుల వర్షం.. 6 నెలల్లో డబ్బు రెట్టింపు, కొంటే మీ పంట పండినట్లే!

Penny Stock: రూ.8 షేరుతో కాసుల వర్షం.. 6 నెలల్లో డబ్బు రెట్టింపు, కొంటే మీ పంట పండినట్లే!

Penny Stock: రూ.8 షేరుతో కాసుల వర్షం.. 6 నెలల్లో డబ్బు రెట్టింపు, కొంటే మీ పంట పండినట్లే!

Multibagger Stock | ఒక షేరు అదిరే లాభాలు పంచిపెట్టింది. కేవలం ఆరు నెలల కాలంలోనే భారీ రిటర్న్ అందించింది. డబ్బులను ఏకంగా రెట్టింపు చేసింది. ఈ షేరు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Share | స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు లాభాల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే డబ్బులను రెట్టింపు చేసింది. ఇంతకీ అది ఏ షేరు అని అనుకుంటున్నారా? సౌత్ ఇండియన్ బ్యాంక్ (Bank) షేరు. ఇది ఇన్వెస్టర్లకు భారీ లాభాలు (Money) అందించింది. కేవలం 6 నెలల కాలంలోనే డబ్బును రెట్టింపు చేసింది. షేరు ధర ఈ కాలంలో రూ. 8 నుంచి రూ. 17 చేరింది. స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బలహీనంగా ఉన్నా కూడా ఈ షేరు మాత్రం జోరు మీద ఉంది. మంగళవారం కూడా ఈ స్టాక్ ధర 2 శాతం వరకు పెరిగింది.

బ్యాంకింగ్ విభాగం సానుకూలముగానే ఉండొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల బ్యాంకింగ్ షేర్లు జోరు చూపించొచ్చని పేర్కొంటున్నారు. సేవింగ్స్ , డిపాజిట్లు పెరగడం వల్ల లెండింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరుకు రూ. 12 వద్ద బలమైన మద్దతు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా షేరు ధర రూ. 20కు పైన స్థిర పడితే.. రూ. 25కే చేరొచ్చని పేర్కొంటున్నారు.

నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. కస్టమర్లు గుర్తించుకోవాల్సిన 10 అంశాలివే!

జీసీల్ బ్రోకింగ్ సీఈవో రవి సింఘాల్ మాట్లాడుతూ.. అధిక వడ్డీ రేటు సీజన్ కారణంగా బ్యాంకింగ్ విభాగం మంచి పనితీరు కనబరచే అవకాశం ఉందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు మెరుగు పడొచ్చని, వచ్చే త్రైమాసికం ఆర్థిక ఫలితాలు కూడా బాగుండొచ్చని వివరించారు. అధిక వడ్డీ రేట్లు కారణంగా ప్రజల నుంచి బ్యాంక్ డిపాజట్లు పెరగొచ్చని, ఆ డబ్బులను బ్యాంకులు ఇతర వ్యాపారాల కోసం ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర! కొత్త రేట్లు ఇలా

అలాగే ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరుకు రూ. 12 వద్ద బలమైన మద్దతు ఉందన్నారు. అలాగే రూ.20 నుంచి రూ. 25 శ్రేణిలో నిరోధం ఉందని తెలిపారు. అందువల్ల ఇప్పటికే స్టాక్‌ను కొనుగోలు చేసిన వారు రూ. 12 స్టాప్ లాస్‌గా పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ షేరు రూ. 20 స్థాయిని అధిగమిస్తే.. రూ. 25 వరకు చేరొచ్చని అంచనా వేశారు.

ఇకపోతే సౌత్ ఇండియన్ బ్యంక్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే 15 శాతం మేర పడిపోయింది. అదే గత నెల రోజుల కాలంలో చూస్తే 7 శాతం మేర పైకి చేరుతుంది. అలాగే గత ఆరు నెలల కాలంలో చూస్తే.. ఈ షేరు ఏకంగా 105 శాతం రాబడిని ఇచ్చింది. అంటే ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసిందని చెప్పుకోవచ్చు. కాగా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. భారీ రిస్క్ ఉంటుంది. కొన్ని సార్లు పెట్టిన డబ్బులు కూడా రాకపోవచ్చు. అందుకే డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట నిపుణుల సలహాలు తీసుకోండి.

First published:

Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు