హోమ్ /వార్తలు /బిజినెస్ /

Multibagger Stocks: రూ.8.86 నుంచి రూ.886 వరకు.. 20 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన యునైటెడ్ స్పిరిట్స్ షేర్ వ్యాల్యూ

Multibagger Stocks: రూ.8.86 నుంచి రూ.886 వరకు.. 20 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన యునైటెడ్ స్పిరిట్స్ షేర్ వ్యాల్యూ

20 ఏళ్లలో..100 రెట్లు పెరిగిన యూబీ గ్రూప్ షేర్ వాల్యూ..

20 ఏళ్లలో..100 రెట్లు పెరిగిన యూబీ గ్రూప్ షేర్ వాల్యూ..

United Spirits Stock: యునైటెడ్ స్పిరిట్స్ షేర్ ధర హిస్టరీని గమనిస్తే.. ఇది మల్టీబ్యాగర్ స్టాక్ కిందకు వస్తుంది. 100 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. ఈ షేర్ విలువ గత నెలలో 9 శాతం క్షీణించి ఒత్తిడికి లోనైంది. అయితే గత ఆరు నెలల్లో యునైటెడ్ స్పిరిట్స్ షేర్ ధర రూ.612 నుంచి రూ.886కు పెరిగింది.

ఇంకా చదవండి ...

స్టాక్ మార్కెట్‌లో (Stock Market) షేర్ విలువ (Share Value) హెచ్చుతగ్గులను (Fluctuations) అంచనా వేయడం అంత సులభం కాదు. మార్కెట్ ఒడిదొడుకులను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు (Investments) పెట్టేవారికే మంచి లాభాలు వస్తుంటాయి. అయితే కొన్ని కంపెనీల షేర్ విలువ తగ్గినా దీర్ఘకాలంలో (Long Term) పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆ కోవకే వస్తుంది ప్రముఖ ఆల్కహాల్ (Alcohol) తయారీ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ (United Spirits). ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ 20 ఏళ్లలో 100 రెట్లు పెరిగింది. ఒకప్పుడు ఈ సంస్థ ఒక షేర్ విలువ రూ.8.86 ఉండగా.. ప్రస్తుతం రూ.886గా ఉంది. దీర్ఘకాలంలో స్థిరంగా విలువను పెంచుకున్న ఈ కంపెనీ మంచి లాభాలను ఆర్జించింది. గత నెల రోజులుగా ఈ సంస్థ స్టాక్స్ ఒత్తిళ్లకు లోనవుతున్నా.. పెట్టుబడిదారులు మాత్రం షేర్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

యునైటెడ్ స్పిరిట్స్ షేర్ ధర హిస్టరీని గమనిస్తే.. ఇది మల్టీబ్యాగర్ స్టాక్ కిందకు వస్తుంది. 100 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్‌ను మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. ఈ షేర్ విలువ గత నెలలో 9 శాతం క్షీణించి ఒత్తిడికి లోనైంది. అయితే గత ఆరు నెలల్లో యునైటెడ్ స్పిరిట్స్ షేర్ ధర రూ.612 నుంచి రూ.886కు పెరిగింది. ఈ కాలంలో 45 శాతం పెరుగుదలను చవిచూసింది. గత ఏడాది కాలంలో రూ.567 నుంచి రూ.886కు పెరిగింది. ఐదేళ్లలో ఈ కంపెనీ స్టాక్ రేంజ్ 115 శాతం పెరిగి షేర్ హోల్డర్స్ డబ్బును రెట్టింపు చేసింది. ఐదేళ్ల క్రితం ఈ సంస్థ షేర్ ధర రూ.380గా ఉంది. ఈ విధంగా గత 20 ఏళ్లలో యునైటెడ్ స్పిరిట్స్ షేర్ రూ.8.86 (నవంబరు 2001లో NSE షేర్ ధర) నుంచి రూ.886.75కు పెరిగింది. అంటే ఏకంగా 100 రెట్లు పెరిగింది.

LPG Gas Cylinder Price: కమర్షియల్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది... హైదరాబాద్‌లో ధర రూ.2278


* పెట్టుబడిపై ప్రభావం..

అయితే నెల రోజుల నుంచి యునైటెడ్ స్పిరిట్స్ షేర్ విలువ తగ్గుతూ వస్తుంది. దాదాపు 9 శాతం క్షీణించింది. నెల క్రితం ఈ కంపెనీ స్టాక్ లో ఎవరైనా పెట్టుబడిదారుడు ఓ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పుడు వారికి రూ.91 వేలు మాత్రమే లభిస్తాయి. అదే ఆరు నెలల క్రితం ఇదే కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం రూ.1.45 లక్షల రాబడి అందుకునేవారు. ఏడాది క్రితం ఇదే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం రూ.1.56 వేలు వస్తాయి.

New Rules: సామాన్యులకు అలర్ట్... నేటి నుంచి అమల్లోకి వచ్చిన 11 కొత్త రూల్స్ ఇవే


ఐదేళ్ల క్రితం ఈ కంపెనీలో లక్ష ఇన్వెస్ట్ చేసుంటే ప్రస్తుతం వారికి రూ.2.15 లక్షలు వచ్చేవి. ఇక 20 ఏళ్ల క్రితం ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాల కోటి రూపాయల రాబడి పొందేవారు. నెల రోజుల క్రితం కొత్తగా ఇన్వెస్ట్ చేసినవారు కొంతమేరకు నష్టపోయినప్పటికీ ఈ స్టాక్ మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవుల ఉన్నాయంటే


* మెక్ డోవెల్ షేర్ ధర..

మరో బెవరేజ్ కంపెనీ మెక్ డోవెల్ షేర్లు సైతం కొనుగోలు చేయవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లేదా మెక్ డోవెల్ షేర్లు మరింత పైకి వెళ్లవచ్చని ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మెక్ డోవెల్ షేర్లను రూ.940 నుంచి రూ.980 మధ్యలో కొనుగోలు చేయవచ్చని, అయితే రూ.850కు కొంటే మాత్రం నష్టం వస్తుందని సూచిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:John Kora
First published:

Tags: Liquor, Stock Market

ఉత్తమ కథలు