Mercedes Cars | కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ (Car Discount) ఆఫర్లను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ఈ విషయం తెలుసుకుంటే అవాక్కు అవుతారు. ఎందుకని అనుకుంటున్నారా? కారు కొంటే ఏకంగా రూ. 27 లక్షల డిస్కౌంట్ ఆఫర్ (Car Offers) లభిస్తోంది. ఏంటి? రూ.27 లక్షలా? అని షాక్ అవుతున్నారా? అవును మీరు చదివింది నిజమే. కారుపై ఏకంగా రూ. 27 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది.
దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన మెర్సిడెస్ బెంజ్ కారుపై ఈ భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ మన దగ్గర లేదు. చైనాలో అందుబాటులో ఉంది. కంపెనీ అమ్మకాలు తగ్గుతూ రావడంతో మెర్సిడెస్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. చైనాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగుంది. అయితే అక్కడ బీవైడీ కంపెనీ అమ్మకాలు దుమ్ములేచిపోతున్నాయి. ఈ కంపెనీ అక్టోబర్ నెలలో ఏకంగా 2.2 లక్షల కార్లను విక్రయించింది. అయితే మెర్సిడెస్ మాత్రం చాలా తక్కువ కార్లను అమ్మింది. దీంతో కంపెనీ భారీ డిస్కౌంట్‌కు తెరతీసింది. అలాగే పలు ఎలక్ట్రిక్ కార్ల ధరలను కూడా తగ్గించేసింది. కాగా బీవైడీ ఇటీవలనే తన తొలి ఎలక్ట్రిక్ కారును భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ధర రూ.4 లక్షలు.. మైలేజ్ 33 కిలోమీటర్లు, చౌక ధరకే లభిస్తున్న 4 కార్లు ఇవే!
చైనాలో ఈక్యూఈ కారు ధర 5,28,000 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ. 60.67 లక్షలు. అయితే ఇప్పుడు ఈ కారును 478000 యువాన్లకు కొనొచ్చు. మన కరెన్సీలో ఈ కారు రేటు దాదాపు రూ. 55 లక్షలు. అలాగే ఈక్యూఎస్ కారుపై భారీ తగ్గింపు ఉంది. దీని రేటు 1.10 మిలియన్ యువాన్లుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని 956000 యువాన్లకు కొనొచ్చు. అంటే ఏకంగా దాదాపు రూ.27 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. జనవరి నుంచి జూలై మధ్య కాలంలో మెర్సిడెస్ అమ్మకాలు 8,800 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఇవి చాలా తక్కువ విక్రయాలు.
బంగారం, వెండి ధరలు ఢమాల్? భారీగా పతనం కానున్న గోల్డ్, సిల్వర్ రేట్లు!
కేవలం మెర్సిడెస్ మాత్రమే కాకుండా టెస్లా కూడా చైనా మార్కెట్లో విఫలం అయ్యింది. అందుకే ఇప్పుడు టెస్లా కంపెనీ అందుబాటు ధరలో కార్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. చైనా అతిపెద్ద మార్కెట్. అక్కడ సక్సెస్ అయితే కంపెనీలకు తిరుగుండదు. కానీ చైనీయులు మాత్రం విదేశీ కంపెనీలకు ఝలక్ ఇస్తున్నారని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Latest offers, Mercedes-Benz