RS 140 TO RS 8168 THIS STOCK TURNED INTO A MULTIBAGGER IN NINE MONTHS MK
Multibagger Stock: ఈ స్టాక్ లో జస్ట్ రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి...ఆరునెలలు మరిచిపోయి ఉంటే కోటీశ్వరులు అయ్యేవారు...
ప్రతీకాత్మకచిత్రం
EKI Energy Services గత తొమ్మిది నెలల్లో 5,734 శాతం రాబడిని అందించింది అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ పెన్నీ స్టాక్ ఈ సంవత్సరం ఏప్రిల్ 7న రూ.140 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర ఏకంగా 8168 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 5 వేల శాతం పెరిగింది.
Multibagger Stock: స్టాక్ మార్కెట్లలో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే లాటరీ టిక్కట్లతో సమానం అని నిపుణులు అంటుంటారు. ఒక్కోసారి ఈ స్టాక్స్ లక్షధికారిని మిలియనీర్ గా మార్చేస్తాయ. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ను (Multibagger Stock) మార్కెట్లో వాటి భవిష్యత్తును ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. మఖ్యంగా దాదాపు సెన్సెక్స్, నిఫ్టీల్లో లిస్ట్ అయినటువంటి 7400 కంపెనీల్లో ఒక మల్టీ బ్యాగర్ (Multibagger Stock) కంపెనీని గుర్తించడం కత్తి మీద సాము అనే చెప్పాలి. కానీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ మీ సంపదను ఊహకు అందనంత రేంజుకు పెంచేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని స్టాక్స్ వేలాది రెట్లు పెరిగే చాన్స్ ఇందులో ఉంది. అయితే వీటిలో రిస్క్ కూడా ఉందని నిపుణులు చెబుతుంటారు. ఇవి ఒక స్థాయికి వచ్చాక అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంటుంది. వీటి పతనం కూడా అంతే ఉంటుంది. కింద పడుతున్న కత్తిని చేత్తో క్యాచ్ చేయడం ఎంత ప్రమాదమో ఈ తరహా పెన్నీ స్టాక్స్ ను హై లెవెల్ లో కొనుగోలు చేసిన తర్వాత నష్టాల్లోకి జారుకోవడం కూడా అంతే సులువుగా జరిగిపోతుంది. తాజాగా EKI Energy Services గత తొమ్మిది నెలల్లో 5,734 శాతం రాబడిని అందించింది అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ పెన్నీ స్టాక్ ఈ సంవత్సరం ఏప్రిల్ 7న రూ.140 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర ఏకంగా 8168 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 5 వేల శాతం పెరిగింది. ఈ స్టాక్ నిజానికి ఈ సంవత్సరం ఏప్రిల్ లో 102 రూపాయల వద్ద లిస్ట్ అయ్యింది. కానీ కంపెనీ రేసుగుర్రంలా దూసుకెళ్లింది. అంటే తొమ్మిది నెలల క్రితం EKI ఎనర్జీ సర్వీసెస్ స్టాక్‌లో 1 లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఈరోజు రూ. 58.34 లక్షలుగా మారి ఉండేది. అయితే ఈ తొమ్మిది కాలంలో అటు సెన్సెక్స్ సూచీ మాత్రం 2,614 పాయింట్లు అంటే 5.26 శాతం మాత్రమే పెరిగింది.
ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం 9:52 గంటలకు బిఎస్ఇలో షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.8,168 వద్దకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.5,614.82 కోట్లుగా ఉంది. BSEలో మొత్తం 0. 25 లక్షల షేర్లు రూ. 20.31 కోట్ల టర్నోవర్‌తో చేతులు మారాయి.
ఇక కంపెనీ వివరాల్లోకి వెళితే మాత్రం సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి సంస్థకు చెందిన ఏడుగురు ప్రమోటర్లు కంపెనీలో మొత్తం 73.47% వాటాను కలిగి ఉన్నారు. అంతేకాదు 262 పబ్లిక్ షేర్ హోలర్డ్స్ 26.53 శాతం కలిగి ఉండటం గమనార్హం.
అయితే ఈ మల్టీ బ్యాగర్ రన్ వెనుక కంపెనీకి చెందిన వ్యాపార ఒప్పందాలు సైతం కారణం అని నిపుణులు పేర్కొంటున్నారు. బలమైన ఫండమెంటల్స్ కూడా కంపెనీ ఎదుగుదలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా కంపెనీ ఓవర్సీస్ మార్కెట్లో పలు ఆర్డర్లను చేజిక్కించుకుంది. ముఖ్యంగా దుబాయిలో ఎన్ కింగ్ ఇంటర్నేషనల్ FZCO ( Enking International FZCO) అనే సంస్థను Dubai free zone (IFAZA)లో డిసెంబర్ 12 ప్రారంభించింది.
EKI ఎనర్జీ సర్వీసెస్ సంస్థ కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్, క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, సేవలు అందిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ సేఫ్ ఆడిట్స్ నిర్వహిస్తుంది. పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులకు శిక్షణను కూడా ఈ సంస్థ అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.