Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో అంటే గంట లోపే రుణాలు మంజూరు చేయడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత. ఇలా ఇప్పటి వరకు మూడు నెలల్లో రూ.35,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది ఈ ప్లాట్‌ఫామ్.

news18-telugu
Updated: March 7, 2019, 9:29 AM IST
Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...
Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...
news18-telugu
Updated: March 7, 2019, 9:29 AM IST
PSBloansin59minutes.com... మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వెబ్‌సైట్ ఇది. మూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్చిన ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌గా రికార్డులు సృష్టిస్తోంది ఈ వెబ్‌సైట్. ఇప్పటి వరకు రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేయడం రికార్డు. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో అంటే గంట లోపే రుణాలు మంజూరు చేయడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత. ఇలా ఇప్పటి వరకు మూడు నెలల్లో రూ.35,000 కోట్ల రుణాలు మంజూరు చేసింది ఈ ప్లాట్‌ఫామ్.

Read this: JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి

Business Ideas, Business loans, 59 minutes loan, 59 minutes approval, 59 minutes loan scheme, 59 minutes loan details, 59 minutes loan apply, 59 నిమిషాల లోన్, 59 నిమిషాల లోన్ అప్లై, 59 నిమిషాల లోన్ దరఖాస్తు, 59 నిమిషాల లోన్ వివరాలు
image: https://www.psbloansin59minutes.com


ఐటీ రిటర్న్స్, జీఎస్టీ డేటా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ లాంటివి నిమిషాల్లో విశ్లేషించి లోన్లు మంజూరు చేయడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత. మామూలుగా అయితే ఇలాంటి రుణాలు మంజూరు చేయడానికి 20-25 రోజుల సమయం పడుతుంది. అది కూడా ఆమోదానికి మాత్రమే. ఆమోదించిన రుణాలను అందజేయడానికి 7-8 రోజుల సమయం పడుతుంది. కానీ... ఆటోమేటెడ్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా కేవలం ఒక గంటలోపే, పారదర్శకంగా రుణాలు మంజూరు అవుతున్నాయని రాజీవ్ కుమార్ చెబుతున్నారు. అంటే ఈ లోన్ల మంజూరులో మానవ ప్రమేయం పూర్తిగా తొలగిపోయింది. అంతే కాదు బ్యాంకులు, పన్నుల అధికారులు తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే అవకాశం కూడా లేదంటున్నారు రాజీవ్ కుమార్.



Read this: IRCTC Food: ఐఆర్‌సీటీసీ ఫుడ్ ప్యాకెట్లపై ఇక బార్ కోడ్స్... ఎందుకో తెలుసా?

Business Ideas, Business loans, 59 minutes loan, 59 minutes approval, 59 minutes loan scheme, 59 minutes loan details, 59 minutes loan apply, 59 నిమిషాల లోన్, 59 నిమిషాల లోన్ అప్లై, 59 నిమిషాల లోన్ దరఖాస్తు, 59 నిమిషాల లోన్ వివరాలు

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.1 కోటి వరకు రుణాలను ఓ గంటలోనే మంజూరు చేయడం విశేషం. ఇప్పటి వరకు 1.62 లక్షల చిన్నతరహా యూనిట్లకు ఆమోద ముద్ర వేసి 1.12 లక్షల యూనిట్లకు రుణాలు మంజూరు చేశారు. మూడేళ్లలో రూ.6,500 కోట్ల రుణాలు ఇచ్చిన రెండు అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ఈ పోర్టల్ ద్వారా లోన్ల మంజూరు చాలా వేగంగా ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ క్రెడిట్ స్యూస్ అభిప్రాయపడయం విశేషం. ఈ పోర్టల్‌లో సగటున రూ.27 లక్షల లోన్ మంజూరు చేయగా, రెండోసారి లోన్ తీసుకున్న వారి సగటు రూ.34 లక్షలు. ఈ లోన్ ప్రాసెస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Loading...
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు

SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...

Aadhar Download: ఇ-ఆధార్ డౌన్‌లోడ్... జస్ట్ 6 స్టెప్స్‌తో సాధ్యం
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...