రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రముఖ లోకల్ సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లు. శుక్రవారం ఈ వివరాలను రిలయన్స్ రిటైల్ వెంచర్ వెల్లడించింది. RVVL కొనుగోలు చేస్తున్న ఈ 40.95 శాతం వాటాలో 25.33 శాతాన్ని (2.12 కోట్ల ఈక్విటీ షేర్లు) కంపెనీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జస్ట్ డయల్ కేటాయించనుంది. ఇందుకు RRVL ఒక్కో షేరుకు గాను రూ.1,022.25 చొప్పున చెల్లించనుంది. ఈ నిధులను సంస్థ అభివృద్ధి, విస్తరణకు వినియోగిస్తామని జస్ట్ డయల్ తెలిపింది. ఈ అంశంపై RRVL డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. జస్ట్ డయల్ లో భాగస్వామ్యం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో ఉన్న తమ భాగస్వామ్య వ్యాపారులు, వివిధ స్థాయిల్లోని సంస్థల ఉన్నతికి డిజిటల్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి జస్ట్ డయల్ లో వాటాలు కొనుగోలు చేశామన్నారు. Amarnath Ji on JioTV: అమర్నాథ్ భక్తులకు జియో శుభవార్త.. ఆన్లైన్లోనే పూజలు.. ప్రత్యేకంగా ఛానల్
రిలయన్స్ తో భాగస్వామ్యం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని జస్ట్ డయల్ వ్యవస్థాపకులు మణి తెలిపారు. తమ బిజినస్ పార్టనర్లు, జస్ట్ డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి కంపెనీ ఇకమీద కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా కొనసాగుతారని RRVL తెలిపింది.
ఈ అంశంపై జస్ట్ డయల్ సీఈఓ మణి మాట్లాడుతూ.. తమ వినియోగదారులకు సమగ్రమైన, నమ్మకమైన సమాచారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటున్నామన్నారు. జస్ట్‌డయల్ కార్యకలాపాలు 1996లో ప్రారంభమయ్యాయి. జస్ట్ డయల్ ఇండియా లీడింగ్ సెర్చ్ ఇంజన్ గా పేరొందింది. వెబ్ సైట్, యాప్స్, టెలిఫోన్ ద్వారా జస్ట్ డయల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.