Hyderabad Nepal Tour | నేపాల్ టూర్ (Tour) ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అదిరే ప్యాకేజ్ అందుబాటులో ఉంచింది. ఆరు రోజులు నేపాల్ (Nepal) చుట్టేసి రావొచ్చు. మంచుకురిసే సమయంలో ఈ హిమాలయ దేశాన్ని సందర్శించొచ్చు. నేపాల్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ హిమాలయ దేశం. పరిమాణంలో చిన్న దేశం అయినప్పటికీ ఇది వైరుధ్యాలు, సంస్కృతి, సాహసాల దేశంగా ప్రసిద్ధి చెందింది. నేపాల్ సంప్రదాయాలు, కళలు, సంస్కృతి గొప్పవని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్ డిసెంబర్ 17న ప్రారంభం అవుతుంది. ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంటుంది. డిసెంబర్ 22న మళ్లీ రిటర్న్ వచ్చేస్తారు. ఇది 5 నైట్స్/ 6 డేస్ టూర్. టూర్ ధర విషయానికి వస్తే.. రూ. 30,310 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది చైల్డ్ (2-11 ఏళ్లు) విత్ఔట్ బెడ్ ఆప్షన్ ఎంచకుంటే ఈ రేటు వర్తిస్తుంది. అదే చైల్డ్ (5-11 ఏళ్లు) విత్ బెడ్ అయితే ధర రూ. 39,520గా ఉంది.
బంగారం, వెండి ధరలు ఢమాల్? భారీగా పతనం కానున్న గోల్డ్, సిల్వర్ రేట్లు!
అలాగే ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరు రూ. 40,755 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరు రూ. 41,990 చెల్లించాలి. ఇక సింగిల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 51,385 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ వెళ్లాలని భావించే వారు కచ్చితంగా ఓటర్ కార్డు కలిగి ఉండాలి.
జీరో డౌన్ పేమెంట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. 45 నిమిషాల్లోనే లోన్!
ప్రపంచ శాంతి పగోడా, మాయా దేవి ఆలయం, స్థానిక బౌద్ధ దేవాలయాలను సందర్శించొచ్చు. లుంబిని, ఫేవా సరస్సు, సారంగ్‌కోట్ వ్యూ పాయింట్, బింధ్యబాసిని మందిర్, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలు చూడొచ్చు. ఇంకా మనోకామ్నా ఆలయాన్ని సందర్శించొచ్చు. ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభూనాథ్ ఆలయం వంటివి చూడొచ్చు.
విమాన టికెట్లు (హైదరాబాద్- గోరఖ్‌పూర్- ఖాట్మాండ్- హైదరాబాద్), బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ గైడ్ సర్వీసులు, ఎంట్రెన్స్ టికెట్లు వంటివి అన్నీ టూర్ ప్యాకేజీలో భాగమే. అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అయితే మధ్యాహ్నం భోజనం మాత్రం మన డబ్బులతోనే తినాలి. ఫ్లైట్‌లో ఏమన్నా తినాలన్నా మనమే ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా ఇతరత్రా ఖర్చులు ఉంటే భరించాల్సి వస్తుంది. మీరు నేపాల్ టూర్ వెళ్లాలని భావిస్తే.. ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్లి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, IRCTC, IRCTC Tourism, Nepal