e-Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే మీరు అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) చౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.
రాయల్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు కేవలం రూ. 36,240కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ క్రెడిట్ కార్డు వంటి వాటి ద్వారా మీరు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే.. రూ. 1500 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీకు రూ. 35 వేల కన్నా తక్కువకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినట్లు అవుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. రూ.2,500తో కోటి రూపాయల బెనిఫిట్!
ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కంపెనీ ఇందులో ఎల్ఈడీ యాసిడ్ అంట్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీని అమర్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 35 కిలోమీటర్లు. లోడ్ కెపాసిటీ 150 కేజీలు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చింది. అంతేకాకుండా రివర్స్ గేర్ కూడా ఉంది.
శుభవార్త.. పడిపోయిన బంగారం ధరలు .. ఈరోజు ఎంత తగ్గాయంటే?
రాయల్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వారంటీ కూడా లభిస్తోంది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ ఉంది. అలాగే మోటార్‌పై కూడా మూడేళ్ల వారంటీ వస్తుంది. చౌక ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. లేదంటే మీకు మార్కెట్‌లో ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి.
కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ వంటి పలు రకాల కంపెనీలు మార్కెట్‌లో వివిధ ఎలక్ట్రిక్ మోడళ్లను అందిస్తున్నాయి. మీరు వీటిల్లో కూడా మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది. మీరు రూ. 85 వేల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు రేటు ఉంది. అంటే వీటి రేటుతో రాయల్ ఈవీ వంటి మోడళ్లను 3- 4 కొనుగోలు చేయొచ్చు. అయితే రేంజ్, ఫీచర్లు, క్వాలిటీ వంటివి కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కొనటప్పుడు అన్ని విషయాలు చెక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, SCOOTER