Royal Enfield: రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు షాకింగ్​ న్యూస్​.. భారీగా పెరిగిన బైక్​ల ధరలు

ప్రతీకాత్మక చిత్రం

రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి వస్తోన్న క్లాసిక్​ 350, హిమాలయన్​, ఇంటర్​సెప్టార్​ 650, కాంటినెంటల్​ జీటీ 650 మోడల్స్​పై సైతం ఈ ధరల పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. వీటితో పాటు మెటార్ 350కి చెందిన ఫైర్​ బాల్​, స్టెల్లార్​, సూపర్​నోవా మూడు వేరియంట్లలో​ బైక్​ ధరలను భారీగా పెంచేసింది.

  • Share this:
ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. బైక్​ లవర్స్​కు బిగ్ షాకిచ్చింది. మెటార్ సిరీస్‌లోని వివిధ మోడల్ బైకుల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. బైక్​ల తయారీ, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి వస్తోన్న క్లాసిక్​ 350, హిమాలయన్​, ఇంటర్​సెప్టార్​ 650, కాంటినెంటల్​ జీటీ 650 మోడల్స్​పై సైతం ఈ ధరల పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. వీటితో పాటు మెటార్ 350కి చెందిన ఫైర్​ బాల్​, స్టెల్లార్​, సూపర్​నోవా మూడు వేరియంట్లలో​ బైక్​ ధరలను భారీగా పెంచేసింది. క్లాసిక్​ 350పై 4.24 శాతం, మెటార్ 350​పై 4.25 శాతం పెంపు ప్రకటించింది. ఇలా మోడల్​ను బట్టి ఒక్కో బైక్​పై సుమారు రూ.10 వేల వరకు ధర పెరిగింది.

ఇప్పటికే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని.. జూలై 1 నుంచి ఇవి వర్తిస్తాయని ఎన్‌ఫీల్డ్ సంస్థ పేర్కొంది. ఇక, ఏ మోడల్ ధర ఎంత పెరిగిందనే వివరాలను పరిశీలిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటార్ 350 ఇకపై రూ.1,92,109 నుంచి ప్రారంభమవుతుంది. గతంలో ఇది రూ.1,84,319 ధర వద్ద అమ్ముడయ్యేది. అంటే, మీటియర్​ 350 వేరియంట్ ధర రూ. 7,790 మేర పెరిగిందని చెప్పవచ్చు. ఇక, స్టెల్లార్ అని పిలిచే మిడ్-వేరియంట్‌ విషయానికి వస్తే. గతంలో ఇది రూ. 1,90,079 ధర వద్ద లభించేది. అయితే, తాజా ధరల పెంపుతో ఇకపై రూ. 1,98,099 వద్ద అందుబాటులో ఉండనుంది. దీని ప్రకారం ఈ మోడల్​పై రూ .8,020 ధర పెరిగిందని చెప్పవచ్చు.

చివరగా టాప్ ఆఫ్ ది లైన్ సూపర్​నోవా వేరియంట్ భారతదేశం అంతటా కంపెనీ డీలర్‌షిప్‌ సెంటర్లలో రూ .2,08,084 ధర వద్ద లభిస్తుంది. ఈ వేరియంట్​ గతంలో రూ. 1,99,679 ధర వద్ద లభించేది. అంటే, దీని ధర రూ .8,405 మేర పెరిగిందని చెప్పవచ్చు. రాయల్​ ఎన్​ఫీల్డ్​ మీటియర్​​ 350 బైక్​ రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే మొదటిసారి.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ మెటార్ 350 ఫీచర్లు
ఈ బైక్​ 349 సిసి సింగిల్​ ఎయిర్/ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్​ 6,100 ఆర్​పిఎమ్​ వద్ద 20.2 బిహెచ్​పి పవర్​ను, 4000 ఆర్​పిఎమ్​ వద్ద 27 ఎన్​ఎమ్​ పీక్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​లో 5 స్పీడ్​ ట్రాన్స్​మిషన్​ ఉంది. ఈ క్రూయిజర్​ తరహా బైక్​కు డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఎల్​ఈడీ టైట్లైట్​, ట్రిప్పర్​ నావిగేషన్​, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్​ విండ్​ స్క్రీన్​ మొదలైనవి చేర్చింది.
Published by:Krishna Adithya
First published: