హోమ్ /వార్తలు /బిజినెస్ /

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఐదు నెలల్లో రెండోసారి ధరల పెంపు.. కొత్త ధరలు ఇవే..

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఐదు నెలల్లో రెండోసారి ధరల పెంపు.. కొత్త ధరలు ఇవే..

 Royal Enfield (ప్రతీకాత్మకచిత్రం)

Royal Enfield (ప్రతీకాత్మకచిత్రం)

ప్రీమియం బైక్స్‌తో యువతను ఆకట్టుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ.. బైక్ లవర్స్‌కు మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మరోసారి కంపెనీ తమ ప్రొడక్ట్స్‌పై ధరలు పెంచింది. రెండు మోడళ్లు తప్ప మిగతా అన్ని బైక్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రీమియం బైక్స్‌తో(Premium Bikes) యువతను ఆకట్టుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ(Royal Enfield Company).. బైక్ లవర్స్‌కు మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మరోసారి కంపెనీ తమ ప్రొడక్ట్స్‌పై(Products) ధరలు పెంచింది. రెండు మోడళ్లు(Models) తప్ప మిగతా అన్ని బైక్స్(Bikes) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 2022లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ మోటార్‌సైకిళ్ల ధరలను రెండోసారి పెంచినట్లు అయింది. ఈ నిర్ణయంతో స్క్రామ్ 411, మెటోర్ 350, హిమాలయన్(Himalayan) 411, అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ 350, బుల్లెట్(Bullet) 350 వంటి మోడళ్ల ధరలు పెరిగాయి. బుల్లెట్ 350 ధర రూ. 3,110 పెరిగింది. క్లాసిక్ 350 బైక్‌పై రూ. 2,846 పెరిగింది. ధరల పెంపు తర్వాత వివిధ వేరియంట్ల కొత్త ధరలు పరిశీలిద్దాం.

Scholarships: ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్కాలర్‌షిప్‌.. ప్రకటించిన యూకే యూనివర్సిటీ.. వివరాలిలా..


రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వేరియంట్ల తాజా ధరలు

రెడ్డిచ్ రెడ్/సేజ్ గ్రీన్/గ్రే (సింగిల్ ABS) – రూ. 1,90,092

హాల్సియోన్ బ్లాక్/గ్రే/గ్రీన్ (సింగిల్ ABS) – రూ. 1,92,889

హాల్సియోన్ బ్లాక్/గ్రే/గ్రీన్ (డ్యుయల్ ABS) – రూ. 1,98,971

సిగ్నల్స్ డెసర్ట్ సాండ్/మార్ష్ గ్రే – రూ. 2,10,385

డార్క్ గన్‌మెటల్ గ్రే/డార్క్ స్టెల్త్ బ్లాక్ – రూ. 2,17,589

క్రోమ్ బ్రాంజ్/రెడ్ – రూ. 2,21,297

* రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350

KS: సిల్వర్/ఓనిక్స్ బ్లాక్ - రూ. 1,68,584

KS: బ్లాక్ - రూ 1,75,584

ES: జెట్ బ్లాక్/రీగల్ రెడ్/రాయల్ బ్లూ – రూ. 1,85,289

** రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350 ధరను రూ.4,225 పెంచింది. పెంపు తర్వాత కొత్త ధరలు ఇవే

* రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350

ఫైర్‌బాల్ ఎల్లో/రెడ్ - రూ. 2,05,844

ఫైర్‌బాల్ వైట్ కస్టమ్/బ్లాక్ కస్టమ్ – రూ. 2,07,681

స్టెల్లార్ బ్లూ/రెడ్/బ్లాక్ - రూ. 2,11,924

స్టెల్లార్ బ్లాక్ కస్టమ్ - రూ 2,13,760

సూపర్నోవా బ్రౌన్/బ్లూ - రూ. 2,22,061

సూపర్నోవా సిల్వర్ కస్టమ్ – రూ. 2,23,896

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

ఈ ఏడాది జనవరిలో ఒకసారి, ఈ నెలలో మరోసారి క్లాసిక్ 350 ధరలు రూ.3,332 మేర పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ స్క్రామ్ 411 వేరియంట్‌కు కంపెనీ మార్చిలో లాంచ్ చేసింది. అయితే లాంచ్ తర్వాత కేవలం ఒక నెలలోనే దీని ధర దాదాపు రూ. 2,500 పెరిగింది. మరింత శక్తివంతమైన 650 ట్విన్స్ - ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ GT ధరలు కూడా రూ. 3000 నుంచి రూ. 5000 వరకు పెరిగాయి. అయితే ఈ మోటార్‌సైకిళ్ల టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం అలాగే ఉన్నాయి.

First published:

Tags: Royal, Royal Enfield, Two wheeler

ఉత్తమ కథలు