• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ROYAL ENFIELD METEOR 350 TO LAUNCH IN INDIA ON NOVEMBER 6 TO BE AVAILABLE IN THREE VARIANTS SS GH

Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి దూసుకొస్తున్న మరో బైక్

Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి దూసుకొస్తున్న మరో బైక్

Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి దూసుకొస్తున్న మరో బైక్

Royal Enfield Meteor 350 Launch | రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో రాబోయే క్రూయిజర్ బైక్‌పై అంచనాలు పెరిగాయి.

  • Share this:
లగ్జరీ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు Meteor 350 బైక్‌ను విడుదల చేయనుంది. దీని కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఇది చాలా రోజుల క్రితమే మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మేటోర్ 350 మోటార్‌సైకిల్‌ను నవంబర్ ఆరున విడుదల చేయనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ గురువారం ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రానున్న రెట్రో క్లాసిక్ క్రూయిజర్‌ను కూడా కొన్ని నెలల క్రితం రోడ్లపై పరీక్షించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో రాబోయే క్రూయిజర్ బైక్‌పై అంచనాలు పెరిగాయి.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

మూడు వేరియంట్లలో...


Meteor 350 మోడల్‌ను ఫైర్బాల్, స్టెల్లార్, సూపర్నోవా అనే మూడు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. గతంలో లీకైన సమాచారం ప్రకారం ఈ బైక్ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌తో లభిస్తుందని తెలుస్తోంది. ఇది బ్లూ టూత్ ఎనేబుల్డ్ నేవిగేషన్‌ సిస్టమ్‌తో పనిచేయనుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్లకు ఈ ఫీచర్లు ఉపయోగపడనున్నాయి.

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఫీచర్లు ఇవే..


ఈ బైక్ కొత్త 350 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, లాంగ్-స్ట్రోక్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 బిహెచ్‌పి శక్తిని, 27 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. క్లచ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. Thunderbird 350X మోడల్‌కు Meteor 350 రీప్లేస్‌మెంట్‌గా మారనుంది. దీని ధర రూ.1.60 లక్షల నుంచి 1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ సంస్థ పెద్ద 650 సిసి క్రూయిజర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: