Royal Enfield Price | రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. దేశంలో వీటికి మంది ఆదరణ ఉంది. యూత్‌లో ఈ బైక్స్‌ను (Bikes) స్టేటస్ సింబల్‌గా కూడా చూస్తారు. చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను (Royal Enfield) కొనాలని భావిస్తారు. అయితే అధిక రేటు కారణంగా కొంత మంది కొనలేకపోవచ్చు. అయితే ఇలాంటి వారికి అదిరే శుభవార్త అందుబాటులో ఉంది. తక్కువ డౌన్ పేమెంట్‌తో బైక్‌ను కొనుగోలు చేయొచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. కంపెనీ డౌన్ పేమెంట్ అమౌంట్‌ను తగ్గించింది. రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. కస్టమర్లు పాపులర్ క్రూయిజర్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటిరో 350 బైక్‌ను కేవలం రూ. 12 వేల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.01 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు.
బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఎక్కడైనా ఒకే రేటు!
రాయల్ ఎన్ఫీల్డ్ మెటిరో 350 బైక్ ప్రస్తుతం మూడు వేరియంట్ల రూపంలో ఉంది. పది కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. టాప్ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,17,791గా ఉంది. ఈ బైక్‌లో 349 బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 191 కేజీలు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.
ఒక్క షేరుకు ఉచితంగా 6 షేర్లు.. ఈ స్టాక్‌కు భలే డిమాండ్, కొనేందుకు పోటీ!
కంపెనీకి చెందిన జే ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేసిన తొలి మోటార్‌సైకిల్ మోటిరో 350 కావడం గమనార్హం. థండర్బర్డ్ స్థానంలో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కొత్త కస్టమర్లు లక్ష్యంగా కంపెనీ ఈ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మోడ్రన్ క్రూయిజర్ బైక్ ఇదని చెప్పుకోవచ్చు.
ఈ బైక్ మైలేజ్ కూడా బాగానే ఉంది. లీటరుకు 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. సిటీ రైడ్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే హైవేలో అయితే 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ రావొచ్చు. ఇందులో మోడ్రన్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్, బ్లూటూత్, డ్యూయెల్ చానల్ ఏబీఎస్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి ఫీచర్లను కూడా గమనించొచ్చు. అదే మీరు ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకు డౌన్ పేమెంట్ ఫెసిలిటీ రూ. 9 వేల నుంచి కూడా ప్రారంభం అవుతోంది. మోడల్ ప్రాతిపదికన డౌన్ పేమెంట్ కూడా మారుతుందని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bikes, Finance, Royal Enfield