రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్ ఈ రోజు విడుదలైంది . Meteor 350 మోడల్‌ను రాయల్ ఎన్ ఫీల్డ్ లాంఛ్ చేసింది. ఇటీవల ఇండియాలో రిలీజైన Honda H’Ness C350 మోడల్‌ను ఢీ కొట్టేందుకు Royal Enfield Meteor 350 బైక్‌ను పరిచయం చేసింది. ఇది 350 సీసీ బైక్. బ్లూటూత్ కనెక్టివిటీతో ట్విన్ పాడ్ క్లస్టర్, డిజిటల్ ఎస్సీడీ స్క్రీన్, ఇందులో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గ్రాఫ్ బార్, సర్వీస్ రిమైండర్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటికే ఉన్న థండర్బర్డ్ 350ఎక్స్ మోడల్‌ను మిటియార్ 350 బైక్ రీప్లేస్ చేస్తుందని తెలుస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ మిటియార్ 350 బైక్‌లో సరికొత్త 349 సీసీ, ఎయిర్‌కూల్డ్, సింగిల్ సిలిండర్ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. ఈ బైకుకు హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రైజ్డ్ హ్యాండిల్ బార్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. మూడు వేరియంట్లలో మిటియార్ 350 రిలీజ్ అయ్యింది. ఎంట్రీ లెవెల్ ఫైర్‌బాల్ పేరుతో రిలీజ్ అవుతుంది. ఇక కాస్త ఖరీదైన మోడల్స్ స్టెల్లార్, సూపర్నోవా పేర్లతో రిలీజ్ అయ్యింది. మొత్తం 7 బాడీ కలర్స్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ మిటియార్ 350 లభిస్తుంది. ఫైర్‌బాల్ యెల్లో, ఫైర్‌బాల్ రెడ్, స్టెల్లార్ రెడ్ మెటాల్లిక్, స్టెల్లార్ బ్లాక్ మ్యాటీ, స్టెల్లార్ బ్లూ మెటాల్లిక్, సూపర్నోవా బ్రౌన్, సూపర్నోవా బ్లూ కలర్స్‌తో రిలీజ్ అయ్యింది
Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే
Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ
హై-స్పెక్ స్టెల్లార్ ధర 1.81 లక్షలు, మరియు టాప్-స్పెక్ సూపర్నోవా ధర 1.90 లక్షలు. ఫైర్ బాల్ ధర రూ. 175 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Royal Enfield, Two wheeler