ప్రీమియం మోటార్ సైకిల్స్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ఇండియా (India)లో కొత్త బైక్స్ (New Bikes) రిలీజ్ చేయడంతో పాటు గతంలో తీసుకొచ్చిన మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్స్ కూడా లాంచ్ చేస్తోంది. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్లు కలర్, డిజైన్, ఫీచర్ల మార్పులతో వీటిని రూపొందిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ 2023 ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, 2023 కాంటినెంటల్ GT 650 బైక్స్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటిలో కొత్తగా అందించిన ఫీచర్లు, కలర్ కాంబినేషన్లు, ధరల వివరాలు తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ 650 ట్విన్ బైక్స్‌ను 2018 సెప్టెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్‌సెప్టర్ 650 రోడ్‌స్టర్ సెగ్మెంట్ బైక్ కాగా, కాంటినెంటల్ GT 650 అనేది కేఫ్ రేసర్ బైక్‌గా లాంచ్ అయ్యాయి. తాజాగా వీటికి కొద్దిపాటి మార్పులతో 2023 ఎడిషన్ బైక్స్‌ను కంపెనీ రూపొందించింది.
* కొత్త కలర్ వేరియంట్స్
2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 బైక్ స్లిప్‌స్ట్రీమ్ బ్లూ, అపెక్స్ గ్రే అనే రెండు కొత్త బ్లాక్డ్ అవుట్ వెర్షన్లలో లభిస్తుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మిస్టర్ క్లీన్, డక్స్ డీలక్స్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, రాకర్ రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి : ఐదు లక్షల హోండా కార్లు రీకాల్.. ఆ మోడల్స్ కొన్నవారికి కంపెనీ హెచ్చరిక!
2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ నాలుగు కొత్త కలర్ స్కీమ్స్‌లో రిలీజ్ అయింది. కస్టమర్లు ఈ వెహికల్‌ను బ్లాక్ రే, బార్సిలోనా బ్లూ బ్లాక్డ్ అవుట్ వేరియంట్స్‌తో పాటు బ్లాక్ పెర్ల్, కాలి గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మార్క్ 2, సన్‌సెట్ స్ట్రిప్, కాన్యన్ రెడ్ కలర్ వేరియంట్స్ కూడా మార్కెట్‌లో కంటిన్యూ అవుతాయి.
* కొత్త ఫీచర్లు
ఈ అప్‌డేటెడ్ 650 సిరీస్ బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా చేర్చింది. కొత్త స్విచ్‌గేర్, USB ఛార్జింగ్ పోర్ట్, కొత్త LED హెడ్‌ల్యాంప్ వంటివి వీటిలో స్టాండర్డ్ ఫీచర్స్‌గా ఉన్నాయి. బ్లాక్డ్ అవుట్ ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ GT వేరియంట్లు బ్లాక్డ్-అవుట్ ఇంజన్, ఎగ్జాస్ట్ పార్ట్స్‌తో వస్తాయి. బ్లాక్డ్ అవుట్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా వచ్చే కాస్ట్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్‌తో ఈ బైక్స్ రన్ అవుతాయి.
* ధర ఎంత?
అప్‌డేటెడ్ 2023 కాంటినెంటల్ GT 650 ధర రూ.3.19 లక్షలు కాగా, 2023 ఇంటర్‌సెప్టర్ 650 వేరియంట్‌ను రూ.3.03 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. ఈ మోడళ్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టోర్స్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ సొంతం చేసుకున్నాయని చెప్పారు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త కలర్ ఆప్షన్స్, అల్లాయ్స్‌తో ఆల్ బ్లాక్ వేరియంట్స్ రూపొందించామని తెలిపారు. కొత్త ఫంక్షనల్ అప్‌గ్రేడ్స్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, New bikes, Royal Enfield