హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ హైదరాబాద్‌కు వచ్చేసింది

Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ హైదరాబాద్‌కు వచ్చేసింది

Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ హైదరాబాద్‌కు వచ్చేసింది
(Credit: Manav Sinha, News18)

Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ హైదరాబాద్‌కు వచ్చేసింది (Credit: Manav Sinha, News18)

Royal Enfield | రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) బైక్ హైదరాబాద్‌కు వచ్చేసింది. ఇటీవల ఈ బైక్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది కంపెనీ. నగరాల్లో కూడా లాంఛింగ్స్ చేస్తోంది రాయల్ ఎన్‌ఫీల్డ్. అందులో భాగంగా హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంఛ్ అయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) బుల్లెట్ హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చేసింది. తెలంగాణలో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,49,900. వేర్వేరు కలర్స్‌లో ఈ బైక్ లభిస్తుంది. తెలంగాణలోని 75 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఔట్‌లెట్స్‌లో (Royal Enfield Outlets) ఈ బైక్స్ బుక్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. ఇప్పటికే బుక్ చేసినవారికి డెలివరీలు ప్రారంభం అయ్యాయి. బుక్ చేసిన కస్టమర్లకు వీలైనంత త్వరగా బైక్‌ను డెలివరీ చేసేలా యూనిట్స్ తయారవుతున్నాయని కంపెనీ చెబుతోంది. కస్టమర్లు ఈ బైక్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కంపెనీ వివరించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ విస్తరిస్తున్న మార్కెట్లో తెలంగాణ కీలకమైనదిగా కొనసాగుతోందని రాయల్ ఎన్‌ఫీల్డ్ హెడ్ ఆఫ్ బిజినెస్ మార్కెట్స్ వీ.జయప్రదీప్ అన్నారు.


భారతదేశంలో టూవీలర్ మార్కెట్లో 6 శాతం మార్కెట్ షేర్ మాకు ఉంది. హంటర్‌తో మా మార్కెట్ షేర్ మరింత పెంచుకుంటాం. బరువు, ధర కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను కొనలేని కస్టమర్లకు ఈ బైక్‌ను చేరువ చేస్తాం.
వీ.జయప్రదీప్, హెడ్ ఆఫ్ బిజినెస్ మార్కెట్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్


రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసే ప్రీమియం బైక్స్‌కు క్రేజ్ ఒక రేంజ్‌లో ఉంటుంది. బైక్ లవర్స్ అందరూ ఈ కంపెనీ నుంచి వచ్చే కొత్త మోడళ్ల గురించి ఆరా తీస్తుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల హంటర్ 350 బైక్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది రెట్రో, మెట్రో రూపంలో రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి వచ్చిన మోడళ్లలో అత్యంత తేలికైన మోడల్‌గా హంటర్ 350 నిలుస్తోంది. ఈ క్లాసీ, అడ్వాన్స్‌డ్ బైక్ ఆకర్షణీయమైన డిజైన్‌లో కనిపిస్తుంది.


SBI ATM Card: పిన్ ఎంటర్ చేయకుండా డెబిట్ కార్డ్ పేమెంట్స్... ఇలా యాక్టివేట్ చేయండి


రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే కలర్ స్కీమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. సిద్ లాల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్‌పై డ్యుయల్ టోన్ పెయింట్ జాబ్ ఉంది. మిగిలిన బాడీ మొత్తం బ్లాక్ పెయింట్ ఫినిషింగ్‌తో కనిపిస్తోంది.


ఇతర స్పెసిఫికేషన్లు హంటర్ 350 17-అంగుళాల వీల్ సెట్‌తో.. ముందు 110/70, వెనుక 140/70 ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉన్న మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మాదిరిగానే కొత్త బైక్‌ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌కు పాడ్-లాంటి ఫినిషింగ్ లభిస్తుంది. ఇది 13 L ఫ్యూయల్ కెపాసిటీ, 800 మిమీ సీట్ హైట్, 150.5 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1370 మిమీ వీల్‌బేస్‌తో వస్తుంది.


Vistadome Coach: అద్దాల రైలులో జర్నీ చేస్తారా? విస్టాడోమ్ రైళ్లు నడిచే రూట్స్ ఇవే


బ్రేకింగ్ పరంగా చూస్తే, కొత్త బైక్‌ ముందు భాగంలో ట్విన్-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 300 mm డిస్క్‌, వెనుకవైపు ఒకే పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ 270 mm డిస్క్ ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌ దీంట్లో అదనపు ఆకర్షణ. సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, కొత్త బైక్‌లో ముందువైపు 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు 6-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్ ఉంది.ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ J-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 27 Nm పీక్ టార్క్‌తో 20.2 bhp టాప్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ లింక్ అయ్యి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 36.2 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Royal Enfield

ఉత్తమ కథలు