Home /News /business /

ROYAL ENFIELD HIMALAYAN ADVENTURE EDITION ANNOUNCED KNOW PRICE AND SPECIFICATIONS HERE MK

Royal Enfield Himalayan Adventure: కొత్త అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసిన ఎన్‌ఫీల్డ్

Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ప్రత్యేకమైన స్టైల్, శైలితో కస్టమర్లను ఆకర్షిస్తాయి. పాత తరం లుక్, సింపుల్ డిజైన్లతో ఈ బైకులు వినియోగదార్లకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎన్ఫీల్డ్... రైడర్ల ఆసక్తులకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ కంపెనీ  మొదటిసారిగా మేక్ ఇట్ యువర్స్-MiY పేరుతో మోటార్ సైకిల్ పర్సనలైజేషన్ సేవలను అందిస్తామని ప్రకటించింది. ఈ సేవలతో వినియోగదారులు ఎన్ఫీల్డ్ బైకును కొనేటప్పుడే తమ ఇష్ట ప్రకారం, దానికి మార్పులు, చేర్పులను అధికారికంగా చేయించుకోవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ ఎడిషన్‌లో అల్యూమినియం పానియర్లు, ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లు యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అల్యూమినియం పానియర్లు బ్రాకెట్లతో పాటు వస్తాయి. ఇవి రైడర్స్ లగేజీని ఉంచడానికి అవసరమైన స్పేస్‌ను అందిస్తాయి.

ఇంకా చదవండి ...

    లగ్జరీ బైక్‌ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ అడ్వెంచర్‌ బైక్‌ లవర్స్‌ కోసం కొత్త మోటార్‌సైకిల్‌తో ముందుకు వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, దాని UK డిస్ట్రిబ్యూటర్ మోటో జిబితో కలిసి సరికొత్త హిమాలయన్ అడ్వెంచర్ ఎడిషన్ బైక్‌ను అభివృద్ధి చేసింది. దీంట్లో ఉండే యాక్సెసరీలు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. 411 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో ఈ బైక్‌ను రూపొందించారు. ఇది 6500 rpm వద్ద 24.5 bhp శక్తిని, 4000- 4500 rpm వద్ద 32 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ ఇంజిన్ క్రాష్ గార్డ్స్‌ సిలిండర్ ఇంజన్‌కు రక్షణగా పనిచేస్తాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ ఎడిషన్‌లో అల్యూమినియం పానియర్లు, ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లు యూత్‌ను ఆకట్టుకుంటాయి. అల్యూమినియం పానియర్లు బ్రాకెట్లతో పాటు వస్తాయి. ఇవి రైడర్స్ లగేజీని ఉంచడానికి అవసరమైన స్పేస్‌ను అందిస్తాయి.

    బేస్ మోడల్ తో పోలిస్తే ధర ఎక్కువే
    బోల్ట్-ఆన్ యాక్సెసరీస్ తప్ప అడ్వెంచర్ ఎడిషన్‌కు కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. హాఫ్-డూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ ఫ్రేమ్‌, 21 అంగుళాల ఫ్రంట్, 17 అంగుళాల రియర్ వీల్‌ వంటి ఫీచర్లు పాతవాటి మాదిరిగానే కనిపిస్తున్నాయి. 200 ఎంఎం ట్రావెల్‌తో 41 ఎంఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, 180 ఎంఎం ట్రావెల్‌తో రియర్ మోనోషాక్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యుయల్ ఛానల్ ABSను అమర్చారు. అడ్వెంచర్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.4.73 లక్షలు. బేస్ మోడల్‌కంటే దీని ధర రూ.39,446 ఎక్కువ. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కొనాలనుకునేవారు డీలర్‌షిప్‌లలో రిజర్వ్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది.

    సంస్థ నుంచి వచ్చిన మరో బైక్
    ఈ నెల ప్రారంభంలో రాయల్ ఎన్ఫీల్డ్ మెటార్ 350 (Meteor 350) బైక్ అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, హెడ్‌ల్యాంప్ చుట్టూ ఎల్‌ఇడి రింగ్, రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్, సౌకర్యవంతమైన సీటు, అల్లాయ్ వీల్స్ వంటి కొత్త ఫీచర్లతో ఈ బైక్‌ను తయారు చేశారు. ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో, బీఎస్6 స్టాండర్డ్స్ ప్రకారం పనిచేస్తుంది. అదనంగా ఫ్యూయెల్ ఇంజెక్షన్ సామర్థ్యం కూడా దీంట్లో ఉంది. ఈ ఇంజిన్ అత్యధికంగా 20.2 bhp శక్తిని, 27 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపొందించిన మెటార్ బైక్ ఇంజిన్, వైబ్రేషన్స్‌ను వీలైనంత తక్కువగా చేసేలా డిజైన్ చేశారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: CAR, Cars

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు