హోమ్ /వార్తలు /బిజినెస్ /

Himalayan 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ టీజర్ లాంచ్.. కొత్త బుల్లెట్ లుక్ సూపరో సూపర్..!

Himalayan 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ టీజర్ లాంచ్.. కొత్త బుల్లెట్ లుక్ సూపరో సూపర్..!

Photo Credit : (Royal Enfield)

Photo Credit : (Royal Enfield)

Himalayan 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ హిమాలయన్ 450 మోడల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఈ అప్‌కమింగ్ బైక్ ఇప్పటికే రియల్ లైఫ్ కండిషన్స్‌లో టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే లాంచింగ్‌కు కూడా సిద్ధమవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) ఎప్పటికప్పుడు సరికొత్త బైక్స్‌ (New Bikes) లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ అన్ని రోడ్ కండిషన్స్‌కు సరిపోయే బైక్స్ డిజైన్ చేస్తోంది. వాటిలో అడ్వెంచర్ టూరర్ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ (Himalayan) సూపర్ పాపులర్ అయింది. అయితే ఈ బైక్‌కి అప్‌డేట్ వెర్షన్‌గా హిమాలయన్ 450 (Himalayan 450) మోడల్‌ను కంపెనీ త్వరలోనే తీసుకురానుంది. ఈ అప్‌కమింగ్ బైక్ ఇప్పటికే రియల్ లైఫ్ కండిషన్స్‌లో టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే లాంచింగ్‌కు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ తాజాగా ఈ బైక్ లుక్‌ను రివీల్ చేస్తూ ఒక టీజర్ వీడియోను షేర్ చేసింది. ఈ టీజర్ వీడియోలో హిమాలయన్ 450 బైక్ ఒక నదిని ఈజీగా క్రాస్ చేస్తున్నట్టు చూడవచ్చు.


టీజర్‌lలో ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఆఫ్-రోడ్ పరిస్థితులలో దూసుకెళ్లడం గమనించవచ్చు. ఈ వీడియోలోని టెక్స్ట్ “టెస్టింగ్ 1,2,3,…” అని కనిపించింది. ఈ బైక్ లుక్ చూస్తుంటే ఇది హిమాలయన్ 450 కావచ్చని తెలుస్తోంది. హిమాలయన్ 450 కొత్త K1 ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ చేశారని సమాచారం.ఇది అధిక సీట్ పొజిషనింగ్‌తో బైక్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు అందుబాటులోకి వచ్చిన హిమాలయన్ బైక్స్ కంటే మెరుగైన ఆఫ్-రోడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడంపై కంపెనీ దృష్టి సారించింది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో అప్‌సైడ్-డౌన్ ఉండే కయాబా ఫ్రంట్ ఫోర్క్‌లను, వెనుక భాగంలో మోనో-షాక్‌ ఉండవచ్చు.

కొత్త హిమాలయన్ బైక్ 450cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ బైక్ పవర్ అవుట్‌పుట్‌ను పెంచుతుంది. కొత్త ఇంజన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, 40 బీహెచ్‌పీ (Bhp) పవర్, 40 ఎన్ఎమ్ (Nm) గరిష్ట టార్క్‌ను అందించగల సామర్థ్యాలతో రావచ్చని టాక్. స్టాండర్డ్ హిమాలయన్‌తో ఇచ్చిన 411cc 24.41 PS @6500 rpm, 32 Nm @ 4000-4500 rpm గరిష్ట అవుట్‌పుట్‌ను అందిస్తుంది. హిమాలయన్ 450 ముందు 21-అంగుళాల స్పోక్ వీల్స్‌, 17-అంగుళాల వెనుక టైర్‌తో రావొచ్చు.


బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు అందించారు. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఇతర అప్‌గ్రేడ్‌లు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో స్పెషల్‌గా అందించనున్నారు. టీజర్ వీడియో చూస్తుంటే ఇందులో కొత్త LED హెడ్‌ల్యాంప్, విండ్‌స్క్రీన్‌, న్యూ టర్న్ ఇండికేటర్లు బైక్‌లో అందించినట్లు అర్థమవుతోంది.


ఇది కూడా చదవండి : కియా సోనెట్ X లైన్ టీజర్‌ విడుదల.. లాంచ్ ఎప్పుడంటే..


ఈ బైక్ ధర ఎంత నిర్ణయిస్తారు అనేదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే స్టాండర్డ్ హిమాలయన్ ధర కంటే కాస్త ప్రీమియం ధరతో ఇది రిలీజ్ కావచ్చు. హిమాలయన్ 450 లాంచ్‌తో భారతదేశంలోని అడ్వెంచర్ విభాగంలో తీవ్ర పోటీని నెలకొనవచ్చు. ముఖ్యంగా KTM 390 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్ వంటి వాటి మధ్య కాంపిటీషన్ పెరగవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bikes, New bikes, Royal Enfield

ఉత్తమ కథలు