Royal Enfield Classic 350: స్టైలిష్ లుక్​తో కొత్త బుల్లెట్టు బండి వచ్చేసింది... ధర ఎంతంటే

Royal Enfield Classic 350: స్టైలిష్ లుక్​తో కొత్త బుల్లెట్టు బండి వచ్చేసింది... ధర ఎంతంటే (Photo: Manav Sinha/News18.com)

Royal Enfield Classic 350 | రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బుల్లెట్టు బండి వచ్చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఇండియాలో లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.

  • Share this:
రాయల్ ఎన్​ఫీల్డ్ (Royal Enfield) బైక్స్​పై యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు​. బుల్లెట్​బండిపై దూసుకెళ్లాలని, షికార్లు కొట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే భారత్​తో సహా ప్రపంచ మార్కెట్​లో మోస్ట్​ పాపులర్​ బైక్​గా రాయల్​ ఎన్​ఫీల్డ్​కు (Royal Enfield) పేరుంది. కంపెనీ కూడా నేటి యువత అభిరుచులకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను లాంచ్ చేస్తుంటుంది. అందుకే ఈ సంస్థ నుంచి కొత్త బైక్​ వస్తుందంటే అందరి చూపు దానిపైనే ఉంటుంది. అటువంటి రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి తాజాగా ఆల్​ న్యూ క్లాసిక్​ 350 మోడల్ (Royal Enfield Classic 350)​ లాంచ్​ అయ్యింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్​షోరూమ్ ధరను రూ.1.84 లక్షలుగా నిర్ణయించారు.

Economy AC Coaches: తక్కువ ధరకే ఏసీ ప్రయాణం... రైళ్లల్లో కొత్త ఏసీ కోచ్​లు వచ్చాయి

ఆకట్టుకునే ఫీచర్లు


ఈ సరికొత్త రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 (Royal Enfield Classic 350) బైక్​ని గతంలో ప్రకటించిన మెటియోర్​ 350 బైక్​ ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్​లో కూడా మెటియోర్​ 350 లాంటి ఇంజిన్​నే అందించారు. అయితే దీని పవర్​ 349 సీసీ ఉండటం వల్ల.. 20 పీఎస్​ పీక్​ పవర్​ని 27 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

మెటియర్​లోని జె ప్లాట్ ఫామ్​ని ఇందులో కూడా అందించింది. దీనిలో బ్లూటూత్​ సహాయంతో స్మార్ట్​ఫోన్​కి కనెక్ట్ అయ్యే టర్న్​ బై టర్న్​ నావిగేషన్​ ఫీచర్​ను చేర్చింది. ఇదే కాకుండా మునుపటిలాగే 5 స్పీడ్​ ట్రాన్స్​మిషన్ గేర్​బాక్స్​ను అందించింది. అయితే దీని ముందు మోడల్స్​లో ఉన్న విధంగా కిక్​ స్టార్లర్​ లేకపోవడం గమనార్హం.

SBI Account: మీరు ఎస్‌బీఐ కస్టమరా? మీ అకౌంట్‌ని ఇలా మారిస్తే ఎక్కువ బెనిఫిట్స్

స్మార్ట్ ఫీచర్స్


ఈ బైక్​ మొత్తం 11 కలర్​ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 9 డ్యుయల్​ ఛానల్​ వేరియంట్లు కాగా, రెండు సింగిల్​ ఛానల్​ వేరియంట్లు. దీనిలో రెట్రో స్టైల్​ రౌండ్​ టెయిల్​ ల్యాంప్స్​, రౌండ్​ టర్న్​ ఇండికేటర్స్​తో పాటు రిట్రో స్టైల్​ హాలోజెన్​ హెడ్​ ల్యాంప్స్​ను అందించింది.

ఇక, ఫీచర్ల విషయానికొస్తే, క్రోమ్ వేరియంట్ నావిగేషన్, USB ఛార్జ్ పోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సర్క్యులర్ స్పీడ్ డయల్ కింద ట్రిప్పర్ సిస్టమ్‌ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఓడోమీటర్ రీడింగ్, ఫ్యూయల్ గేజ్ వంటి ఇన్‌పుట్​ ఫీచర్లను కూడా అందించింది. ఇక, ఫీచర్లను బట్టి చూస్తే ఈ బైక్​ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్​ సీటర్​ క్లాసిక్​ 350, ట్విన్​ సీటర్​ క్లాసిక్​ 350, క్లాసిక్​ 350 సింగిల్​ ఎడిషన్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: