హోమ్ /వార్తలు /బిజినెస్ /

Royal Enfield Bike: భారీగా పెరుగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 2022 బైక్‌ సేల్స్.. ధర, వేరియంట్లు, మైలేజ్, ఫీచర్లు ఇవే..

Royal Enfield Bike: భారీగా పెరుగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 2022 బైక్‌ సేల్స్.. ధర, వేరియంట్లు, మైలేజ్, ఫీచర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కు ఇండియన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 2008లో ఈ మోడల్‌ను మరోసారి లాంచ్ చేసినప్పటి నుంచి ఇండియన్ బైకర్స్‌ను ఇది ఆకర్షిస్తోంది. క్లాసిక్ 350 బైక్‌ను 1948 నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్ G2ను ప్రేరణగా తీసుకొని రూపొందించారు.

ఇంకా చదవండి ...

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) క్లాసిక్ 350 బైక్‌కు (Bike) ఇండియన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 2008లో ఈ మోడల్‌ను మరోసారి లాంఛ్ చేసినప్పటి నుంచి ఇండియన్ బైకర్స్‌ను ఇది ఆకర్షిస్తోంది. క్లాసిక్ 350 బైక్‌ను 1948 నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్ G2ను ప్రేరణగా తీసుకొని రూపొందించారు. ఇది స్వింగింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రొడక్షన్ మోటార్‌సైకిల్. బైక్ డిజైన్, పనితీరు పరంగా ఎన్ని మార్పులు వచ్చినా.. ఇండియన్ మార్కెట్‌లో దీనికి ఉన్న ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. ఫిబ్రవరి 2022 సేల్స్ గణాంకాల ప్రకారం.. 200 cc నుంచి 500 cc కెపాసిటీ మధ్య ఉన్న బైక్‌ సేల్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 టాప్ ప్లేస్‌లో ఉంది. క్లాసిక్ తర్వాత బుల్లెట్ 350, కొత్త మెటోర్ 350 లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. క్లాసిక్ బైక్‌లో మార్పులను తీసుకువచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. గత ఏడాది సెప్టెంబర్‌లో సరికొత్త క్లాసిక్ 350 బైక్‌ను విడుదల చేసింది.

కొత్త క్లాసిక్ 350 బైక్ ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై). టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 2.18 లక్షల వరకు ఉండవచ్చు. ఈ బైక్ ప్రస్తుతం సింగిల్-ఛానల్, డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ను రెడ్‌డిచ్ సిరీస్, హాల్‌సియోన్ సిరీస్, క్లాసిక్ సిగ్నల్స్, డార్క్ సిరీస్, క్రోమ్ సిరీస్‌లలో అందిస్తుంది. రెడ్డిచ్ సిరీస్ మోడల్ ఎంట్రీ లెవల్ క్లాసిక్ 350. దీనికి రియర్ డ్రమ్ బ్రేక్‌ ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు. హల్‌సియోన్ మోడల్ డ్యూయల్-ఛానల్ ABS, డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. దీని ధర రూ. 1.93 లక్షలు. సిగ్నల్స్ వేరియంట్ ధర రూ. 2.04 లక్షలు. అల్లాయ్ వీల్స్‌తో కూడిన డార్క్ సిరీస్ మోడల్ ధర రూ. 2.11 లక్షలు. టాప్ క్రోమ్ సిరీస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 2.18 లక్షలు.

Yamaha R15: సరికొత్త ఫీచర్లతో అలరిస్తున్న యమహా R15 V4.0 బైక్.. దీని ధర, మైలేజ్, ఫీచర్లతో సహా పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్త క్లాసిక్ 350 బైక్‌ను వివిధ మోడళ్లలో, వేర్వేరు కలర్ స్కీమ్ ఆప్షన్స్‌లో పరిచయం చేసింది. రిడ్డిచ్ సిరీస్ గ్రే, రెడ్, సేజ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉండగా, సిగ్నల్స్ మోడల్‌.. డెసర్ట్ సాండ్, మార్ష్ గ్రే కలర్ స్కీమ్‌లో లభిస్తాయి. డార్క్ సిరీస్ మోడల్‌ స్టెల్త్ బ్లాక్, గన్‌మెటల్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. హల్‌సియోన్ మోడల్‌ బైక్స్.. బ్లాక్, గ్రీన్, గ్రే కలర్స్‌లో లభిస్తున్నాయి.

Tata Avinya: అరగంట ఛార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు... టాటా నుంచి మరో సూపర్ కార్

కొత్త క్లాసిక్ 350 బైక్ 349 cc సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 27 ఎన్ఎమ్‌ టార్క్‌ను, 6100 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్టంగా 120 kmph వేగాన్ని అందుకోగలదు. మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ స్టార్ట్‌ ఫీచర్‌తో వస్తుంది. ఈ బైక్ 13 లీటర్ల సామర్థ్యంతో టియర్‌డ్రాప్ షేప్ ఫ్యుయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. క్లాసిక్ 350 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 805 మిమీ సీట్ హైట్‌, ఫంక్షనల్ LCD డిస్ప్లేతో పాటు అనలాగ్ స్పీడోమీటర్‌తో వస్తుంది.

First published:

Tags: Bike, Royal Enfield

ఉత్తమ కథలు