Royal Enfield News | ఏటా ఎన్నో రకాల బైక్‌లు మార్కెట్లలోకి వస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే కస్టమర్ల మనసు దోచుకుంటాయి. అలాంటి వాటిల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 () ఒకటి. దీన్ని కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలు ఇష్టపడుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌ల్లో (Bikes) ఇది ఒకటిగా నిలిచింది. అత్యంత ఎక్కువకాలం సేల్ అయిన మోడల్ కావడంతో దీనికి ప్రత్యేక అభిమానులు సైతం ఉన్నారు. అయితే ఒకప్పటి ఈ బైక్ ధర ఎంతో మీకు తెలుసా? అందుకు సంబంధించిన ఓ బిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం.. ఆల్ న్యూ క్లాసిక్ 350 ధర రూ.2.2 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఒకప్పుడు ఈ బైక్ ధర రూ.18,700. మరీ ఇంత తక్కువనా అని అనిపింవచ్చు. అయితే అప్పటి కాలంలో ఇది చాలా పెద్ద ధరే. ఈ బైక్‌కు సంబంధించి 1986 జనవరి 23 నాటి బిల్లు ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాతకాలపు బైక్‌లంటే ఇష్టపడే బీయింగ్ రాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బిల్లును పోస్ట్ చేశారు. రూ.18,700తో ఉన్న ఈ బిల్ 36 సంవత్సరాల పాతదని తెలిపారు. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన సందీప్ ఆటో కంపెనీ డీలర్ ఈ బిల్ అందజేసినట్లు తెలుస్తోంది.
కేంద్రం బంపరాఫర్.. ఉచితంగా రూ.లక్ష పొందండిలా, జనవరి 12 వరకే ఛాన్స్!
సోషల్ మీడియాలో పోస్ట్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓల్డ్ బిల్ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 53000కు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇలా స్పందించారు.. ‘నా దగ్గర 1984 ఫిబ్రవరి మోడల్ ఉంది. అప్పట్లో దీని ధర రూ.16,100. ఇప్పటికీ ఇది గత 38 సంవత్సరాల నుంచి నాతోనే ఉంది’ అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి .. ‘మేం 1980లో ముంబయి (అప్పటి బొంబాయి) గ్రాంట్ రోడ్ మినర్వా సినిమా హాల్ ఎదురుగా ఉన్న డీలర్ అలీ భాయ్ ప్రేమ్‌జీ దగ్గర బుల్లెట్‌ను రూ.10,500కు కొనుగోలు చేశాం.’ అని కామెంట్ చేశారు. ఇంకో వ్యక్తి గోల్డెన్ డేస్ అంటూ పోస్ట్ చేశారు. మరో వ్యక్తి ఓల్డ్ మెషిన్స్ చాలా మంచివి అని కామెంట్ చేశారు.
2023 డెడ్‌లైన్స్.. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన 17 తేదీలు ఇవే, లేదంటే ఫసక్కే!
అప్పట్లో బుల్లెట్‌ను కేవలం ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అని పిలిచేవారు. అప్పట్లో ఇది బాగా పాపులర్ అయింది. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం భారత సైన్యం ఈ మోడల్‌ను ఎక్కువగా ఉపయోగించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సంవత్సరాలు గడిచే కొద్ది పరిస్థితులకు తగ్గట్టు కొన్ని సాంకేతిక మార్పులకు గురైంది. అయితే దాన్ని లుక్‌లో ఎలాంటి మార్పులు చేయడకుండా మేకర్స్ జాగ్రత్తలు పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bikes, Bullet bike, Royal Enfield