Home /News /business /

ROAD TRANSPORT MINISTRY IS PUSHING AHEAD WITH ITS DECISION TO REQUIRE SIX AIRBAGS IN CARS DESPITE RESISTANCE FROM SOME CARMAKER GH SK

Cars Airbags: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే.. ఈ విషయంలో తగ్గేదే లేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Air bags in cars: కార్ల తయారీ సంస్థలు అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పకుండా ఆరు ఎయిర్ బ్యాగ్స్ వాడాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని కార్ల తయారీ కంపెనీల నుంచి ప్రతిఘటన ఉన్నప్పటికీ.. అధికారులు దీనిపై ముందుకే వెళ్తున్నారు.

ఇంకా చదవండి ...
కార్ల తయారీకి సంబంధించి ప్రతి కంపెనీ కొన్ని స్టాండర్ట్స్ ఏర్పరచుకుంటుంది. ఆ నియమ, నిబంధనల ప్రకారమే కార్ల ఉత్పత్తి (Cars Production)ని కొనసాగిస్తుంది. అయితే కొన్నిసార్లు వివిధ దేశాల్లోని ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం సేఫ్టీ స్టాండర్ట్స్ మారవచ్చు. భారత్‌లోనూ ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కార్ల తయారీ సంస్థలు (Car Makers) అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పకుండా ఆరు ఎయిర్ బ్యాగ్స్ వాడాలని (Six air bags in passenger cars) కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (Union Road Transport Ministry) నిర్దేశించింది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని కార్ల తయారీ కంపెనీల నుంచి ప్రతిఘటన ఉన్నప్పటికీ.. అన్ని ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు (Airbags) ఉండాలనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకువెళుతోంది. అయితే దీనివల్ల కార్ల ధరలు కొంతమేర పెరగవచ్చని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ తెలిపింది. “భద్రత అనేది చర్చించలేనిది. మంత్రిత్వ శాఖ నిబంధనలను ఖరారు చేస్తోంది. దీన్ని నోటిఫై చేయడానికి కొంత సమయం పడుతుంది” అని సదరు అధికారి చెప్పారు. కానీ దీనికి సంబంధించిన నిర్ధిష్ట టైమ్‌ను ఆయన వెల్లడించలేదు.

Realme GT 2: ఈ స్మార్ట్‌ఫోన్‌పై తొలి సేల్‌లోనే రూ.5,000 డిస్కౌంట్

ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అన్ని కొత్త కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం జనవరిలో డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ జారీ చేసింది. నాలుగు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు వైపులా లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కార్లలో ఉండాలని తెలిపింది. దీనికి సంబంధించి ఒక నెల తర్వాత నిబంధనలను ఖరారు చేయవచ్చని భావించారు. అయితే ఇప్పటికీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆటో కంపెనీల ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషిస్తోంది. ఈ విషయంపై భారతదేశంలోని ఒక పెద్ద కార్ల తయారీ సంస్థ రాయిటర్స్‌తో వివరాలు పంచుకున్న తర్వాత.. తాజాగా ఓ అధికారి దీనిపై స్పందించారు. వాస్తవానికి ఈ నియమంతో చిన్న కార్ల ధరలు మరింత పెరగవచ్చు. దీంతో వాహనం కోసం ఎక్కువ ఖర్చు చేయలేని కొంతమంది కొనుగోలుదారులు కొత్త కారు కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది.

* ఖర్చుపై అంచనాలు..
అన్ని కార్లలో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం అనేది ఇప్పటికే తప్పనిసరి నియమంగా ఉంది. అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడానికి ఖర్చు 75 డాలర్ల కంటే ఎక్కువ ఉండదని ప్రభుత్వం అంచనా వేసింది. ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ JATO డైనమిక్స్ మాత్రం.. ఈ నిబంధనతో ఖర్చులు కనీసం 231 డాలర్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో స్థానికంగా విడిభాగాలను తయారు చేయడానికి అవసరమైన ఖర్చు, సమయంపై మంత్రిత్వ శాఖ ఎయిర్‌బ్యాగ్ తయారీదారులను సంప్రదించిందని ప్రభుత్వ అధికారి తెలిపారు.

కొన్ని కంపెనీలు అదనపు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లను ఎగుమతి చేస్తాయి కానీ భారతదేశంలో విక్రయించే మోడళ్లు కనీస అవసరాలకు మాత్రమే సరిపోతాయి. అలాగే కార్లలోని టాప్-ఎండ్ వేరియంట్లలో సాధారణంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అయితే బేస్ మోడళ్లలో మాత్రం కేవలం రెండు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు తమ భద్రత కోసం ఎక్కువ డబ్బు చెల్లించవలసి వస్తుందని సదరు అధికారి వెల్లడించారు.

Apple iPhone: యాపిల్ నుంచి మరో వినూత్న ఐఫోన్.. మొదటిసారి వాటి ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ..

“కార్ల తయారీ కంపెనీలు భద్రత విషయంలో ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలి. దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలు తమంతట తాము చేయనందున మేము నిబంధనలను నిర్దేశించాల్సి వస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. కార్లలో సీటు బెల్ట్‌లతో పాటు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉంటే.. 2020లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 39,000 మందిలో కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలను రక్షించవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Cars, Road safety, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు