Stock Recommendations | స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు దుమ్మురేపుతోంది. ఇన్వెస్టర్ల పంట పండించింది. స్మాల్ క్యాప్ స్టాక్ ఆర్‌వో జువెల్స్ భారీ లాభాలు (Money) అర్జించిపెట్టింది. ఇప్పుడు ఈ షేరు స్టాక్ స్ల్పిట్‌కు రెడీ అవుతోంది. ఒక్కో షేరును ఐదు స్టాక్స్‌గా విభజించనుంది. అంటే ఒకరి వద్ద ఒక్క షేరు (Stocks) ఉంటే అది ఐదు షేర్లుగా మారిపోతుంది. ఈ షేరు గత 9 నెలల కాలంలో ఏకంగా 1400 శాతం మేర పరుగులు పెట్టింది. దీంతో కంపెనీ స్టాక్ స్ల్పిట్ ఆప్షన్ ఎంచుకుంది.
2022 డిసెంబర్ 29న జరిగిన బోర్డు మీటింగ్‌లో కంపెనీ స్టాక్ స్ల్పిట్ చేయాలని నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన స్టాక్‌ను ఐదు షేర్లుగా విభజిస్తారు. ఆర్‌వో జువెలర్స్ షేరు దర 2022 మార్చి 29న కేవలం రూ. 4.2 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు షేరు ధర రూ. 65కు చేరింది. కేవలం 9 నెలల్లోనే స్టాక్ ప్రైస్ పరుగులు పెడుతూ వచ్చింది. దీంతో ఇన్వెస్టర్ల పంట పండిందని చెప్పుకోవచ్చు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి జాక్‌పాట్ లాంటి ఆఫర్.. బస్ టికెట్‌పై రూ.3,000 క్యాష్‌బ్యాక్!
అంటే 9 నెలల కిందట ఈ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 15 లక్షలకు పైగా మారి ఉండేది. ఇకపోతే ఆర్‌వో జువెల్స్ రెండేళ్ల కిందట ఐపీవోకు వచ్చింది. ఇష్యూ పరిమాణం రూ. 4.91 కోట్లు. ప్రైస్ బాండ్ రూ. 36. కంపెనీ షేర్లు 2020 మార్చి 25న మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి.
మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? క్షణాల్లో రూ.3 లక్షల లోన్ పొందండిలా!
కాగా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని సార్లు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి రాకపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఈక్విటీ మార్కెట్ అనుగుణంగా ఉంటుంది. లేదంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచింది. అందువల్ల రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే వీటిల్లో రాబడి తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఉన్నా కూడా రాబడి కూడా ఎక్కువగానే లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks