ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయని, రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జారీ చేసిన సర్క్యులర్‌పై గందరగోళం తలెత్తిన సంగితి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు చేసే యూపీఐ పేమెంట్స్‌కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సీఈఓ దిలీప్ ఆస్బే క్లారిటీ ఇచ్చారు. న్యూస్18 నెట్వర్క్ నిర్వహిస్తున్న థర్డ్ ఎడిషన్ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో ఆయన ఈ స్పష్టతను ఇచ్చారు.
కస్టమర్లు ఏ చెల్లింపు లావాదేవీకి అయినా, అది పీర్ టు పీర్ అయినా లేదా పీర్ టు మర్చంట్ అయినా ఛార్జీలు చెల్లించరని, చెల్లింపు వ్యవస్థ యొక్క వినియోగదారుగా ఎల్లప్పుడూ వ్యాపారి మాత్రమే పేమెంట్ సిస్టమ్‌కు నామమాత్రపు, సహేతుకమైన ఛార్జీలను చెల్లిస్తారని దిలీప్ ఆస్బే తెలిపారు. భారతదేశంలో క్యాష్ టు జీడీపీ రేషియో ప్రస్తుతం 13 శాతంగా ఉందన్నారు.
LIC Policy: రూ.50 లక్షల రిటర్న్స్ కావాలా? ఈ ఎల్ఐసీ పాలసీ మీకోసమే
భారతదేశ ప్రజా వస్తువులు ప్రపంచ ప్రజావసరాలు కావాలనేది ప్రధానమంత్రి విజన్ అని, రాబోయే 5 సంవత్సరాలలో, భారతదేశ పేమెంట్ వ్యవస్థను ఇతర దేశాలు ఉపయోగించే కాలం ఇంకెంతో దూరంలో లేదన్నారు. ఇప్పటికే UPIని ఉపయోగించడం ద్వారా, రెండు దేశాలు కొన్ని సెకండ్లలోనే లావాదేవీలు చేయగలవని ప్రపంచానికి విశ్వాసం ఇచ్చిందని సింగపూర్ మోడల్ నిరూపించిందని దిలీప్ ఆస్బే తెలిపారు.
అంతేకాకుండా, ఇంటర్‌చేంజ్ ఛార్జీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPI) ఉపయోగించే వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని, కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీలు ఉండవని NPCI స్పష్టం చేసింది. NPCI పీపీఐ వాలెట్‌లను ఇంటర్‌ఆపరబుల్ UPI వ్యవస్థలో భాగం చేయడానికి అనుమతించింది. PPIని ఉపయోగిస్తున్నప్పుడు రూ.2,000 కంటే ఎక్కువ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై 1.1 శాతం ఛార్జీ విధించింది.
తాజాగా ప్రవేశపెట్టిన ఇంటర్‌చేంజ్ ఛార్జీలు PPI వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని, కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీ ఉండదని, బ్యాంక్ ఖాతా ఆధారిత UPI చెల్లింపులకు అంటే సాధారణ UPI చెల్లింపులు చేస్తే బ్యాంక్ ఖాతాకు ఎటువంటి ఛార్జీలు ఉండవని NPCI స్పష్టం చేసింది. యూపీఐ కాకుండా, వినియోగదారులు UPI- ఎనేబుల్ చేసిన యాప్‌లలో ఏదైనా బ్యాంక్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్ , ప్రీపెయిడ్ వాలెట్‌లను ఉపయోగించుకోవచ్చని NPCI తెలిపింది.
Medicine Prices: అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి 384 మందుల ధరలు పెరగనున్నాయి
ఇక ఇటీవల కాలంలో యూపీఐ ఉచితంగా, వేగవంతమైన, సురక్షితమైన, ఎలాంటి ఇబ్బందులు లేని అనుభవాన్ని అందిస్తోందని, అందుకే డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారని NPCI వివరించింది. బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు జరిపే లావాదేవీలు ఉచితం అన్న విషయం కస్టమర్లు గుర్తుంచుకోవాలి. కస్టమర్లకే కాదు, వ్యాపారులకు కూడా ఈ లావాదేవీలు ఉచితం. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, UPI, Upi payments