ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆయా సెంట్రల్ బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఇండియాలో కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అద్దెలు ద్రవ్యోల్బణంపై(Inflation) పోరాటంలో ఆర్బీఐకి కొత్త సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణంలో ఇంటి అద్దెలు, (House Rents) అనుబంధ ఖర్చులు 10.07 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం మూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి. గత సంవత్సరంలో చాలా వరకు పెరుగుతున్న ఆహార ధరలతో పోరాడవలసి వచ్చిన సెంట్రల్ బ్యాంక్‌కు(Reserve Bank Of India) కొత్త ఆందోళన ఎదురవుతోంది.
* పెరిగిన అర్బన్ హౌసింగ్ ద్రవ్యోల్బణం
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సమాచారం మేరకు.. 2022 డిసెంబర్‌లో అర్బన్ హౌసింగ్ ద్రవ్యోల్బణం ఇయర్ ఆన్ ఇయర్ 4.47 శాతానికి పెరిగింది. అదే ఏడాది క్రితం ఇదే కాలంలో 3.61 శాతంగా, 2020 డిసెంబర్‌లో 3.21 శాతంగా ఉంది. అక్టోబర్‌లో 4.58 శాతం నుంచి నవంబర్, డిసెంబర్‌లలో ఇండెక్స్ కొద్దిగా తగ్గినప్పటికీ, ఇది 2019 నుంచి అత్యధిక స్థాయిలకు దగ్గరగా ఉంది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.72%కి పడిపోయింది. వరుసగా రెండో నెల RBI కంఫర్ట్ జోన్ 2%- 6%లో ఉంది. గత సంవత్సరం మొదటి 10 నెలలు అప్పర్ ఎండ్‌లో కొనసాగింది. అయితే, సాధారణంగా అస్థిర ఆహారం, ఇంధన ధరలను మినహాయించే ప్రధాన ద్రవ్యోల్బణం 6 శాతానికి దగ్గరగా ఉంది.
* నగరాల్లో భారీగా అద్దెల పెంపు
మింట్‌తో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త అదితి గుప్తా మాట్లాడుతూ.. ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగుతోందని, అందువల్ల గృహ ద్రవ్యోల్బణం పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పారు. నాన్ ఫుడ్ బాస్కెట్ ఇటీవలి ద్రవ్యోల్బణ ఒత్తిడిని చాలా వరకు భరించిందని ఆమె పేర్కొన్నారు. ఇండియాలోని టాప్ ఏడు నగరాల్లో 2022లో ప్రీ-పాండమిక్ స్థాయిల నుంచి అద్దెలు సగటున 20 నుంచి 25 శాతం పెరిగాయి. కొన్ని ప్రముఖ హౌసింగ్ సొసైటీలలో 30 శాతం కంటే ఎక్కువ పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ రంజనీ సిన్హా మాట్లాడుతూ.. హైబ్రిడ్ వర్క్ కల్చర్, పెద్ద ఇళ్ల అవసరం, మహమ్మారి ప్రభావం అలాగే ఉండవచ్చనే అభిప్రాయాలు వంటివి అద్దె ధరల మధ్య ప్రధాన ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని అన్నారు.
SBI: స్టేట్‌బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. మరింత భారంగా EMI.. ఆ లెక్కలివే..!
* పెరిగిన ఇంటి ధరలు
ఆర్బీఐ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ మేరకు.. హౌసింగ్ ధరలు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఒక దశాబ్దంలో గరిష్ట స్థాయికి చేరాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పూణె, హైదరాబాద్ , చెన్నై, బెంగళూరు లో ఇళ్ల ధరలు అక్టోబర్, డిసెంబర్ మధ్య 4%- 7% పెరిగాయని అనరాక్ తెలిపింది. ఇందుకు ఇన్‌పుట్ ఖర్చులు, కోవిడ్ అనంతర డిమాండ్ కారణంగా పేర్కొన్నారు. గృహాల ధరలు వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం బాస్కెట్‌లో భాగం కానప్పటికీ, వాటి ప్రభావం నిర్మాణం, ముడిసరుకు ధరల రూపంలో తెలుస్తుంది. ఆర్థిక వృద్ధికి అనుగుణంగా, రాబోయే కొన్ని సంవత్సరాల్లో గృహాల ధరలు క్రమంగా పెరుగుతాయని ఆస్తి నిపుణుల రాయిటర్స్ పోల్ చూపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.