RILS SHARES SURGE NEARLY 3 PRECENT AFTER KKRS INVESTMENT IN RELIANCE RETAIL SK
Reliance: రిలయన్స్‌కు KKR బూస్ట్.. 3 శాతం పెరిగిన షేర్ విలువ
రిలయన్స్ రీటైల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన రావడంతో.. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ దూకుడు ప్రదర్శించింది. ఆ కంపెనీ షేర్ 3 శాతం మేర ఎగిసింది.
రిలయన్స్ రీటైల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన రావడంతో.. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ దూకుడు ప్రదర్శించింది. ఆ కంపెనీ షేర్ 3 శాతం మేర ఎగిసింది.
బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ రీటైల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన రావడంతో.. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ దూకుడు ప్రదర్శించింది. ఆ కంపెనీ షేర్ 3 శాతం మేర ఎగిసింది. ప్రస్తుతం రిలయన్స్ షేర్ విలువ Rs 2,276.20 కి చేరింది. రిలయన్స్‌తో పాటు విప్రో, ఇన్ఫో సిస్, బ్రిటానియీ, హెచ్ సీఎల్ టె క్, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, టైటన్ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్ టెల్, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ ఫ్రాం, గ్రాసిం కంపెనీలు నష్టపోతున్నాయి.
రిలయన్స్ రిటైల్‌లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను రూ.5550 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరింది. ఈ నెలలో రిలయన్స్ రిటైల్‌లోకి పెట్టుబడులు రావడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 9న సిల్వర్ లేక్ సంస్థ రూ.7.500 కోట్ల పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో కేకేఆర్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.11,367 కోట్ల పెట్టబడులు పెట్టింది కేకేఆర్.
కేకేఆర్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత పెరగడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. రిటైల్ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో సంస్కరణలు తెచ్చింది.. ఇండియన్ రిటైల్ రంగంలో తమ దార్శనికతను అమలు చేయడంలో కేకేఆర్ విలువైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారతీయులందరికీ లబ్ధి జరిగేలా ఇండియన్ రిటైల్ ఎకో సిస్టమ్‌లో సంస్కరణలు తెస్తామని తెలిపారు. రిలయన్స్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత ముందుకెళ్లడం సంతోషంగా ఉందని కేకేఆర్ కోఫౌండర్, కో సీఈవో హెన్నీ క్రావిస్ తెలిపారు. వర్తకులను ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు కొత్త తరహా రిటైల్ అనుభూతిని కలిగిస్తామని పేర్కొన్నారు.