RIL TO ACQUIRE NEW YORKS LUXURY HOTEL MANDARIN ORIENTAL FOR 98 MILLION HERE DETAILS NS
RIIHL: మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ హోటల్లో మెజారిటీ వాటా దక్కించుకున్న రిలయన్స్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
హోటల్స్ రంగంలో పెట్టుబడులను రిలయన్స్ పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా 'మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్' హోటల్లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్(RIIHL) ఒప్పందం కుదుర్చుకుంది.
2003లో ఏర్పాటైన మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ (Mandarin Oriental Hotel, New York) ఓ ఐకానిక్ లగ్జరీ హోటల్ గా పేరొందింది. ఇది ప్రపంచ గుర్తింపును కలిగి ఉంది మరియు AAA ఫైవ్తో సహా అనేక ప్రభావవంతమైన అవార్డులను గెలుచుకుంది. డైమండ్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ హోటల్ మరియు ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ స్పా లాంటి అనేక అంతర్జాతీయ అవార్డులు ఈ హెటల్ దక్కించుకోవడం విశేషం. 2018లో 115 మిలియన్ల డాలర్లు, 2019లో 113 మిలియన్ డాలర్లు మరియు 2020లో 15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ హోటల్ పొందింది. India Mobile Congress 2021: 5Gని త్వరగా విడుదల చేయాలి.. అందుబాటు ధరలోనే సేవలు ఉండాలన్న ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ఆతిథ్య రంగంలో పెట్టుబడులను అధికంగా పెడుతోంది. ఇప్పటికే సంస్థ ఈఐహెచ్ లిమిటెడ్, స్టోక్ పార్క్ లిమిటెడ్(బ్రిటన్)లలో పెట్టుబడులు పెట్టింది. మార్చి 2022 చివరికి ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఒకవేళ ఈ హోటల్లోని ఇతర పెట్టుబడిదారులు కూడా తమ వాటా విక్రయిస్తే, ప్రస్తుత ధరకు అనుగుణంగానే కొనుగోలు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.