Home /News /business /

RIL SAYS WILL ACHIEVE ZERO NET DEBT STATUS AHEAD OF SCHEDULE BA

Reliance | అనుకున్న లక్ష్యం కంటే ముందే అప్పులేని కంపెనీ: రిలయన్స్

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

2021 నాటికి రిలయన్స్ సంస్థ అప్పులు లేనిదిగా నిలదొక్కుకోవాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది.

    అప్పు లేని కంపెనీగా మారాలని తాము పెట్టుకున్న లక్ష్యాన్ని అనుకున్న గడువు కంటే ముందే చేరుకుంటామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఈరోజు నాలుగో త్రైమాసిక ఫలితాలను, అలాగే వార్షిక ఫలితాలను ప్రకటించింది. రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రోగ్రాంను ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యే నాటికి అందుకుంటామని స్పష్టం చేసింది. తాజాగా రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ పెట్టిన పెట్టిన రూ.43574 కోట్లు కూడా అందులో భాగమే. బ్రిటిష్ పెట్రోలియం కూడా రిలయన్స్‌లో పెట్టుబడులు పెట్టింది. ఫేస్ బుక్ డీల్‌ను చూసిన తర్వాత చాలా మంది తమ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని, రాబోయే కొన్ని నెలల్లో ఆ స్థాయి డీల్ మరొకటి కుదిరే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వాస్తవానికి 2021 నాటికి రిలయన్స్ సంస్థ అప్పులు లేనిదిగా నిలదొక్కుకోవాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ఆ లక్ష్యాన్ని అంతకంటే ముందే చేరుకుంటామని ఇప్పుడు ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Mukesh Ambani, Reliance Industries, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు