RIL: దసరా పండుగ రోజున రిలయన్స్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

Reliance Industries Limited (RIL): కరోనా కారణంగా... కొంతమంది ఉద్యోగులకు శాలరీల్లో కొంత కోత పెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్... ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పి... ఉద్యోగుల్లో పండగ సంబరాలు తెచ్చింది.

news18-telugu
Updated: October 26, 2020, 10:44 AM IST
RIL: దసరా పండుగ రోజున రిలయన్స్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్
RIL: ఉద్యోగులకు రిలయన్స్ గుడ్‌న్యూస్. కోతపెట్టిన శాలరీల చెల్లింపు. పండగ బోనస్‌ ప్రకటన (File)
  • Share this:
Reliance Industries Limited (RIL): ఇండియాలో కరోనా వైరస్ వచ్చాక... దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీల్లో కోత పెట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా... కొంత మంది ఉద్యోగుల శాలరీలలో కొంత శాతం కోత పెట్టింది. ఇప్పుడు ఇండియాలో కరోనా జోరు తగ్గడం, దసరా పండుగ కూడా రావడంతో... ఉద్యోగులను సంతోష పెట్టేందుకు రిలయన్స్... కోతపెట్టిన శాలరీలను తిరిగి చెల్లించబోతున్నట్లు ప్రకటించింది. అలాగే... కరోనా కారణంగా... ఆపేసిన పెరఫార్మెన్స్ బోనస్‌ను... పండగ బోనస్‌గా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన ఓ సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే... దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక గ్రూపు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థలో 3.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీళ్లందరికీ... ఇప్పుడు మేలు జరగనుంది. కరోనా నుంచి దేశం కోలుకుంటున్న సమయంలో... పారిశ్రామిక రంగానికి ఈ నిర్ణయం బూస్ట్ ఇవ్వనుంది. మిగతా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడనుంది.

శాలరీలు తిరిగి ఇవ్వడం, ఎరియర్స్‌తో సహా ఇవ్వడమంటే... పెద్ద మొత్తంలో మనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో మేలు చేస్తుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఎంతో కొంత బూస్ట్ ఇస్తుంది. వీటితోపాటూ... రిలయన్స్... వచ్చే ఏడాది శాలరీలో... 30 శాతాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చే ఆఫర్ కూడా తెస్తోంది. ఇది ఉద్యోగుల్లో ధైర్యాన్ని మరింత పెంచనుంది. ఈ చెల్లింపులు... అక్టోబర్ శాలరీలతో ఇస్తామని రిలయన్స్ తెలిపింది. కష్టకాలంలో కంపెనీతో కలిసి ముందుకు సాగినందుకు... కంపెనీ కూడా మీకు తోడుగా ఉంటుందని రిలయన్స్ తన ప్రకటనలో తెలిపింది.

ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి రిలయన్స్... శాలరీల్లో కోతలు పెట్టింది. హైడ్రోకార్బన్స్ డివిజన్‌లో ఉద్యోగులకు 10 శాతం నుంచి 50 శాతం దాకా కోత పెట్టింది. ఇప్పుడు తిరిగి చెల్లించబోతోంది. ఈ సందర్భంగా... తన రెమ్యునరేషన్‌ రూ.15 కోట్లను వదులుకోవడానికి గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సిద్ధపడ్డారు. నిజానికి కరోనా సమయంలో... ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన రిలయన్స్... ఆరోగ్యపరంగా వారికి అన్ని సదుపాయాలూ కల్పించింది. అనారోగ్యం వచ్చినా, కరోనా సోకినా... కంపెనీయే ఖర్చుల సంగతి చూసుకుంది. రిలయన్స్ తాజా ప్రకటన వలల చమురు రంగం, రిటైల్, మీడియా, టెలికం రంగాలకు మేలు జరగనుంది.

Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd.
Published by: Krishna Kumar N
First published: October 26, 2020, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading