RIL Q3 PROFIT RISES 7 7 TO RS 10251 CRORES JIO NET JUMPS 22 AK
జియో దూకుడు... లాభాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రిలయన్స్ కంపెనీ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. గత త్రైమాసికంలో నమోదు చేసిన రూ. 681 కోట్ల లాభంతో పోలిస్తే... ఈ సారి 22.1 శాతం అధికంగా రూ. 831 కోట్ల లాభాన్ని సాధించింది జియో.
మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.7 శాతం వృద్ధితో రూ. 10,251 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఒక త్రైమాసికంలో రూ. 10,000 వేల కోట్ల లాభాన్ని నమోదు చేసిన తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీ నిలిచింది. కంపెనీ యొక్క స్థూలమైన ఆదాయం 9.1 శాతం వృద్ధితో రూ. 1.56 లక్షల కోట్లుగా నమోదైంది. గ్లోబల్ వ్యాపార వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా... స్థిరమైన పనితీరు కారణంగా మంచి ఫలితాలు సాధించామని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి ముఖేష్ ధీరూభాయ్ అంబానీ తెలిపారు. రిటైల్, జియోల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాధించిందని, కంపెనీ లాభాలు పెరగడంలో ఇది కూడా కీలకమని ఆయన అన్నారు.
గత త్రైమాసికంలో నమోదు చేసిన రూ. 681 కోట్ల లాభంతో పోలిస్తే... ఈ సారి 22.1 శాతం అధికంగా రూ. 831 కోట్ల లాభాన్ని రిలయన్స్ జియో సాధించింది. కంపెనీ మొదలుపెట్టిన రెండో ఏడాదిలోనే రిలయన్స్ జియో పది వేల త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 12.4 వృద్ధిని నమోదు చేసిన జియో రూ. 10,383 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా 2.70 కోట్ల మంది కస్టమర్లు జియోలోకి వచ్చారు. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 28 కోట్లకు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.