RIL Q2 Results: రిలయన్స్‌కు రూ.1.2 లక్షల కోట్ల రెవిన్యూ, రూ.9567 కోట్ల లాభం

జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం వచ్చినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రకటించింది.

news18-telugu
Updated: October 30, 2020, 9:33 PM IST
RIL Q2 Results: రిలయన్స్‌కు రూ.1.2 లక్షల కోట్ల రెవిన్యూ, రూ.9567 కోట్ల లాభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెలికాం, రిటైల్ రంగాల్లో ఆదాయం పెరిగింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.8380 కోట్ల లాభాలను ఆర్జిస్తే, రెండో త్రైమాసికంలో అది రూ.9567 కోట్లకు పెరిగింది. CNBC-TV18 నిర్వహించిన పోల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికంలో రూ.8134 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. అయితే, అంతకు మించిన లాభాలను రిలయన్స్ నమోదు చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ప్రకటించిన రూ.13,248 కోట్లలో రిలయన్స్ బీపీ మొబిలిటీ కోసం బిపీ సంస్థకు విక్రయించిన స్టాక్స్ (రూ.4966 కోట్లు) కూడా ఉన్నాయి.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా రెవిన్యూ రూ.1,53,384 కోట్లు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో అది రూ.1,16,195 కోట్లుగా ఉంది. అలాగే, CNBC-TV18 నిర్వహించిన పోల్‌‌ అంచనాలను కూడా రిలయన్స్ అధిగమించింది. CNBC-TV18 నిర్వహించిన పోల్‌లో రూ.1.06కోట్ల రెవిన్యూ అంచనా వేసింది.

RIL Q2FY21 EBITDA కు సంబంధించి కూడా CNBC-TV18 పోల్ అంచనా రూ.18,153 కోట్లు కాగా, దాన్ని బీట్ చేస్తూ రిజల్స్ట్ వచ్చాయి. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో RIL Q2FY21 EBITDA రూ.18,945 కోట్లు నమోదు చేసింది.

2020 సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్ వద్ద 35 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్చి 23న క్లోజింగ్ నుంచి లెక్కిస్తే 131 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్ 16 నాటికి రూ.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి చేరుకుంది. ఆ సంస్థ షేర్ ధర రూ.2,369.35కి చేరింది.

‘గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సారి ఆపరేషనల్ పరంగా, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించాం. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, రిటైల్ రంగాల్లో మెరుగుపడ్డాం. డిజిటల్ సర్వీసెస్ బిజినెస్‌లో కచ్చితమైన పురోగతిని సాధించాం.’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో డొమెస్టిక్ డిమాండ్ పెరిగిందని, ప్రస్తుతం చాలా ఉత్పత్తుల డిమాండ్ కోవిడ్ 19 పూర్వస్థితికి చేరుకుందని ముఖేష్ అంబానీ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రిటైల్ వ్యాపార యాక్టివిటీ నార్మల్ స్థితికి చేరుకుందన్నారు. దీంతోపాటు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. స్ట్రాటజిక్, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను రిలయన్స్ ఫ్యామిలీలోకి ఆహ్వానించామన్నారు. వృద్ధి చెందేందుకు మరిన్ని వ్యూహాలు చేపడతామన్నారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో
రిలయన్స్ రెవిన్యూ రూ.64,431 కోట్లు (23.3శాతం వృద్ధి)

రిలయన్స్ నికర లాభం రూ.6,546 కోట్లు (34.3శాతం వృద్ది)

జియో రెవిన్యూ రూ. 21,708 కోట్లు (7.1 శాతం వృద్ధి)
జియో నికర లాభం రూ. 3,020 కోట్లు (19.8 శాతం వృద్ది)
2020 సెప్టెంబర్ 30 నాటికి జియో కస్టమర్ల సంఖ్య 40.56 కోట్లు (1.8శాతం వృద్ది)
వైర్‌లెస్ డేటా ట్రాఫిక్ 1,442 కోట్ల గిగా బైట్లు (1.5 శాతం వృద్ది)

రిలయన్స్ రిటైల్ రెవిన్యూ రూ.41,100 కోట్లు
రిలయన్స్ రిటైల్ నికర లాభం రూ.973 కోట్లు (125.8 శాతం వృద్ది)
దేశవ్యాప్తంగా 11,931 రిలయన్స్ రిటైల్ స్టోర్లు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 125 కొత్త స్టోర్లు
Published by: Ashok Kumar Bonepalli
First published: October 30, 2020, 8:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading