Home /News /business /

RIL Q1 RESULTS RELIANCE INDUSTRIES NET PROFIT RISES TO 17 955 CRORE IN 2022 23 FIRST QUARTER HERE DETAILS NS

Reliance Industries: మొదటి త్రైమాసికంలో దుమ్ములేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. లాభం రూ. 17,955 కోట్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం మొదటి త్రైమాసికంలో 46.3 శాతం పెరిగింది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను (Q1) ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం మొదటి త్రైమాసికంలో 46.3 శాతం పెరిగింది. 2021-22 మొదటి త్రైమాసికంలో రూ.12,273 కోట్లుగా ఉన్న నికర లాభం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 17,955 కోట్లుగా ఉందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,44,372 కోట్లు కాగా.. ప్రస్తుతం 54.5 శాతం పెరిగి రూ.2,23,113 కోట్లకు చేరుకుంది. 2021-22 నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ.2,11,887 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రకటనపై కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మాట్లాడుతూ.. ప్రపంచ రాజకీయ సంక్షోభం కారణంగా ఇంధన మార్కెట్ ప్రభావితమైందని అన్నారు. కంపెనీ O2C బాగా పనిచేసిందన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితి ఉన్నప్పటికీ, కంపెనీ మంచి ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల ప్లాట్‌ఫాం పురోగతి పట్ల తాను కూడా చాలా సంతోషంగా ఉన్నానని ఆయన అన్నారు.

    లాభాల బాటలో జియో..
    ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఇన్ఫోకామ్ సైతం తొలి త్రైమాసికంలో దుమ్ములేపింది. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 23.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.3,501గా నమోదైంది. ఈ ఏడాది రూ.4,335గా నమోదైంది. గత త్రైమాసికంతో పోల్చితే 3.9 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఆదాయంతో పోల్చితే 21.6 శాతం వృద్ధి నమోదైంది.

    గతేడాది ఈ సమయంలో కంపెనీ ఆర్జించిన ఆదాయం రూ.17,994 కోట్లు. అయితే.. ఈ ఏడాది ఆ ఆదాయం రూ.21,873 గా నమోదైంది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) తో పాటు వినియోగదారుల సంఖ్య కూడా పెరగడంతో కంపెనీకి లాభాలు కురిపించింది. కంపెనీ EBITDA 2022-23 మొదటి త్రైమాసికంలో 27.2 శాతం పెరిగి రూ. 10,964 కోట్లకు చేరుకుంది. అలాగే గత ఏడాది ఇదే కాలంలో రూ. 8,617 కోట్లుగా ఉంది. 30 జూన్ 2022 నాటికి కంపెనీ నికర విలువ రూ. 2,02,132 కోట్లుగా ఉంది. అయితే.. ఇది గతేడాది జూన్ 2లో రూ. 1,86,475 కోట్లు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Mukesh Ambani, Reliance group, Reliance Industries, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు