RIL Q1 results| అంచనాలను మించిన రిలయన్స్ క్యూ 1 ఫలితాలు...జియో ఆదాయం 6 శాతం వృద్ధి...

రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో జూన్ క్వార్టర్ కు సంబంధించి ఏకీకృత నికర లాభం రూ.10,104 కోట్లుగా ప్రకటించింది.

news18-telugu
Updated: July 19, 2019, 9:10 PM IST
RIL Q1 results| అంచనాలను మించిన రిలయన్స్ క్యూ 1 ఫలితాలు...జియో ఆదాయం 6 శాతం వృద్ధి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 19, 2019, 9:10 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో జూన్ క్వార్టర్ కు సంబంధించి ఏకీకృత నికర లాభం రూ.10,104 కోట్లుగా ప్రకటించింది. పలు సంస్థలు వేసిన అంచనాలను మించి రిలయన్స్ లాభాలు నమోదు చేసింది. సీఎన్‌బీసీ-టీవీ 18 పోల్ ఈ క్వార్టర్‌లో రూ.9852 కోట్లుగా అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.1,72,956 కోట్లుగా నమోదు కాగా, 22.1 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో స్టాండలోన్ నికర లాభం రూ.9036 కోట్లు నమోదు కాగా, 2.4 శాతం వృద్ధి నమోదైంది. పన్ను చెల్లింపునకు మునుపు ఆదాయం 4.7 శాతం వృద్ధి నమోదు చేయగా, రూ.14366 కోట్లుగా నిలిచింది. అయితే గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ మాత్రం స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ప్రతీ బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చేందుకు $8.10/bbl గా నిలవగా ఇది గడిచిని 18 క్వార్టర్ల కన్నా కనిష్టం కావడం గమనార్హం. ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే పన్నుచెల్లింపునకు ముందు ఆదాయం, పన్ను, ఎబిటా 2 శాతం వృద్ధితో రూ. 21315 కోట్లుగా నమోదైంది.

ఇక రిలయన్స్ జియో విషయానికి వస్తే జూన్ తో ముగిసిన ఈ క్వార్టర్ లో నికర లాభం రూ.891 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో రెవెన్యూ విషయానికి వస్తే రూ. 11,679కోట్లుగా నమోదైంది. ఇక రిలయన్స్ జియో సబ్ స్క్రయిబర్ల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. మొత్తం 3.38 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్ల సంఖ్య ఈ క్వార్టర్లో వృద్ధి చెందింది.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...