రిలయన్స్ తొలి త్రైమాసిక నికర లాభం రూ.9,485 కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో భాగమైన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో రూ.612 కోట్ల లాభాన్ని నమోదుచేసుకుంది.

news18-telugu
Updated: July 27, 2018, 10:09 PM IST
రిలయన్స్ తొలి త్రైమాసిక నికర లాభం రూ.9,485 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసంలో 0.3 శాతం వృద్ధితో రూ.9,485 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది నాలుగో త్రైమాసంలో రిలయన్స్ ఇండస్ట్రీ నికర లాభం రూ.9,350 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంతో పోల్చితే నికర లాభం 4.5 శాతంగా ఉంది. మునుపటిలానే పెట్రో కెమికల్స్ విభాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల ఆర్జనకు వెన్నుదన్నుగా నిలిచింది.

2018 జూన్ మాసంతో ముగిసిన త్రైమాసంలో రిలయన్స్ జియో రూ.612 కోట్ల లాభాలను ఆర్జించింది. అంతకు ముందు త్రైమాసం నమోదైన లాభం(రూ.510 కోట్ల)తో పోల్చితే ఈ త్రైమాసంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.


తొలి త్రైమాసంలో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంతో పోల్చితే 10.1 శాతం పెరిగి రూ.1.29 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ వెల్లడించింది. మెరుగైన వ్యాపార నిర్వహణా సామర్థ్యంపై తమ ప్రాధాన్యతను కొనసాగిస్తామని రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ తెలిపారు. పెట్రో కెమికల్స్ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని, ఇది తమ లాభాలకు మద్దతు చేసిందని వెల్లడించారు. ఈ విభాగంలో 5.7 శాతం వృద్ధితో రూ.40,287 కోట్ల వ్యాపారం చేశామని, రిఫైనరీ విభాగంలో రూ.95,646 కోట్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు.


First published: July 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>