హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL Q1 Result | మొదటి త్రైమాసికంలో రిలయన్స్ లాభం.. రూ.13,248 కోట్లు..

RIL Q1 Result | మొదటి త్రైమాసికంలో రిలయన్స్ లాభం.. రూ.13,248 కోట్లు..

Reliance Industries | రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభాలను ఆర్జించింది.

Reliance Industries | రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభాలను ఆర్జించింది.

Reliance Industries | రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభాలను ఆర్జించింది.

  ఆయిల్ వ్యాపారం, టెలీ కమ్యూనికేషన్స్, డిజిటల్, రిటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2020 - 21 సంవత్సరం మొదటి త్రైమాసికంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలనే గడించింది. ఈరోజు ప్రకటించిన ఫలితాలను చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో రూ.13,248 కోట్ల లాభాలను ఆర్జించింది. రిలయన్స్ జియో ARPU వృద్ధిరేటు 7.4 శాతం (గత త్రైమాసికంతో పోలిస్తే) గా ఉంది. మార్కెట్ వర్గాల అంచనాలను అధిగమించి వృద్ది సాధించింది.

  Reliance Industries Limited, RIL, Mukesh Ambani, Forbes Real-Time Billionaire, Larry Page, Jeff Bezos, Bill Gates, Mark Zuckerberg, Warren Buffet, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్ఐఎల్, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్
  ముఖేష్ అంబానీ

  జియో ARPU మరింత వృద్ది చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అల్టామౌంట్ క్యాపిటల్ సంస్థకు చెందిన ప్రకాష్ దివాన్ సీఎన్‌బీసీ టీవీ 18కు తెలిపారు. ‘తర్వాత పరిగెత్తబోయే గుర్రం రిటైల్ రంగమే. రిలయన్స్ స్టాక్స్ ‌ను అమ్మాలనే ఒత్తిడిని మనం ఊహించకపోవచ్చు. ఆగస్టులు రూ.2300 జోన్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది.’ అని ప్రకాష్ దివాన్ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర జూలై 27న అత్యధికంగా రూ.2198.70గా ఉంది. జియో ప్లాట్ ఫాంలో పెట్టుబడులు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నిధుల వరద వచ్చింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ మరింత బలంగా తయారైంది. నిఫ్టీలో అత్యధికంగా వృద్ధి చెందిన స్టాక్స్ లో ఇది కూడా ఒకటి. మార్చి 23న అత్యల్పంగా ఉన్నప్పటి ధరతో పోలిస్తే 145 శాతం పెరిగింది. వార్షిక వృద్ధి పరంగా చూస్తే 41 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. కరోనా వైరస్ సమయంలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఊహించని విధంగా పనితీరు కనబరిచింది. ఆయిల్, జియో, ఆయిల్ టు కెమికల్ వంటివి మెరుగ్గా లాభాలను ఆర్జించాయి.

  రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెస్ రిలీజ్

  మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్ ఫాం వాటాల విక్రయం ద్వారా రూ.1,52,056 కోట్లు పెట్టుబడులను సంపాదించింది. ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టి వాటాలు కొనుగోలు చేశాయి. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ సంస్కృతి పెరగడంతో జియో డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. రిలయన్స్ ‌కు చెందిన జియో మార్ట్, జియో మీట్ లాంటి యాప్స్ ‌ను భారీ ఎత్తున డౌన్ లోడ్స్ చేసుకున్నారు. అలాగే, కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో ప్రపంచంలోని 50 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది.

  First published:

  Tags: Mukesh Ambani, Reliance, Reliance Digital, Reliance Industries, Reliance Jio

  ఉత్తమ కథలు