ప్రపంచంలోని టాప్ 51 సంస్థగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్...12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో సంచలనం...

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే 51 వ అత్యంత విలువైన సంస్థగా పేరు పొందింది. ఆయిల్, టెలికం, రిటైల్ వ్యాపారాలతో కూడిన RILమార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే రూ .12 లక్షల కోట్లు దాటేసింది.

news18-telugu
Updated: July 13, 2020, 11:20 PM IST
ప్రపంచంలోని టాప్ 51 సంస్థగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్...12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో సంచలనం...
ముఖేష్ అంబానీ (File)
  • Share this:
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే 51 వ అత్యంత విలువైన సంస్థగా పేరు పొందింది. ఆయిల్, టెలికం, రిటైల్ వ్యాపారాలతో కూడిన RILమార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే రూ .12 లక్షల కోట్లు దాటేసింది. సోమవారం, RIL స్టాక్ ఇంట్రాడే రికార్డు గరిష్ట స్థాయి 1,947 ను తాకింది. దీంతో మార్కెట్ క్యాప్‌ను రూ .12,34,282 కోట్లకు చేరుకుంది. బిఎస్‌ఇలో 3.22 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 1,939 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా అటు ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 1,784 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఆపిల్ (1,663 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (1,620 బిలియన్ డాలర్లు), అమెజాన్ (1,596 బిలియన్ డాలర్లు), ఆల్ఫాబెట్ (1,052 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

టాప్ 50 కంపెనీల జాబితాలో 34 కంపెనీలు అమెరికాకు చెందినవి, 9 కంపెనీలు ఆసియా ప్రాంతానికి చెందినవి ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఆసియాలో 9 వ స్థానంలో ఉండగా, టెన్సెంట్, క్వీచో మౌతై, టిఎస్ఎంసి, శామ్సంగ్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, పింగ్ ఆన్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, టయోటా మోటార్ టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్చి 23 కనిష్ట స్థాయి నుండి ఏకంగా 123.5 శాతం ర్యాలీతో లాభాలు మూటగట్టుకోగలిగింది. నిఫ్టీ 50 సూచీ 44 శాతం ర్యాలీకి RIL కూడా బూస్ట్ గా పనిచేసింది. అంతేకాదు నిఫ్టీ 50 లో మార్చి కనిష్టాల నుండి రెట్టింపు విలువ పొందిన ఏకైక సంస్థగా రిలయన్స్ నిలిచింది.

ఇప్పటికే ఫేస్‌బుక్, జనరల్ అట్లాంటిక్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కమ్ వెంచర్స్, కెకెఆర్, సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్, ఎల్ కాటర్టన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్ నుంచి రూ .73,636.43 కోట్లు పెట్టుబడులు లభించాయి.

అటు జియో ప్లాట్‌ఫామ్‌ల నుండి సేకరించిన నిధులతో, 53,124 కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూతో పాటు పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్‌లో బిపికి వాటా అమ్మకాలతో, ముఖేష్ అంబానీ గ్రూప్ సంస్థ 2021 మార్చి 31 తేదీకి ముందే నికర రుణ రహిత సంస్థగా మారింది. మార్చి 31,2021 అసలు షెడ్యూల్‌ కన్నా ముందే రిలయన్స్ నికర రుణ రహితంగా మారిందని, చైర్మన్ ముఖేష్ అంబానీ జూన్ 19 న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published by: Krishna Adithya
First published: July 13, 2020, 11:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading