రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆల్‌టైమ్ హై!

రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే మార్కెట్ వ్యాల్యూ రూ.8 లక్షల కోట్ల మార్క్ దాటితే... సోమవారం రిలయెన్స్ షేర్లు 1 శాతం లాభపడ్డాయి.

news18-telugu
Updated: August 27, 2018, 3:15 PM IST
రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆల్‌టైమ్ హై!
(Image: Reuters)
  • Share this:
రిలయెన్స్ షేర్లు 1 శాతం లాభపడ్డాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. జియో రెండో అతిపెద్ద టెల్కోగా అవతరించడం ఒక కారణమైతే... జెనిసిస్ కలర్‌లో రిలయెన్స్ వాటాలు 49.46 శాతానికి పెంచుకోవడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు. ఇంట్రాడే హై రూ.1,291.85, ఇంట్రాడే లో 1,280.00 నమోదు చేసింది ఆర్ఐఎల్ షేర్. రిలయెన్స్ జియో రెండో అతిపెద్ద టెల్కో కంపెనీగా అవతరించింది. వొడాఫోన్ ఇండియాను దాటేసింది. జూన్ క్వార్టర్‌లో జియో రెవెన్యూ మార్కెట్ షేర్ 22.4 శాతానికి పెరిగింది. వొడాఫోన్ ఇండియా 19.3 శాతానికి పడిపోయింది. ఐడియా సెల్యులార్ 15.4 శాతానికి తగ్గింది. భారతీ ఎయిర్‌టెల్ 31.7 శాతంతో మొదటి స్థానంలో ఉంది. టెలికాం మార్కెట్‌లో జియో రెండో స్థానానికి చేరడం ఆర్ఐఎల్ షేర్లకు బూస్ట్ ఇచ్చింది. దానికి తోడు జెనిసిస్ కలర్స్ లిమిటెడ్‌లో జియో 3.07 శాతం ఈక్విటీ హోల్డింగ్స్ పెంచుకోవడం మరో కారణం. ప్రస్తుతం జీసీఎల్‌లో ఆర్ఐఎల్ వాటా 49.46 శాతం.

First published: August 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>