స్టార్టప్‌లకు జియో ఉచిత ఇంటర్నెట్.. ప్రకటించిన ముఖేశ్ అంబానీ..

JIO | Free Internet for Startups | టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో- మైక్రోసాఫ్ట్ అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందిస్తాం అని ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 12, 2019, 2:03 PM IST
స్టార్టప్‌లకు జియో ఉచిత ఇంటర్నెట్.. ప్రకటించిన ముఖేశ్ అంబానీ..
ముఖేశ్ అంబానీ
  • Share this:
భారతీయ స్టార్టప్‌లకు రిలయన్స్ సీఎండీ ముఖేశ్ అంబానీ సూపర్ ఆఫర్ ప్రకటించారు. స్టార్టప్‌లను అభివృద్ధి చేసే దిశగా.. వాటికి జియో ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు  వెల్లడించారు. ‘టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో- మైక్రోసాఫ్ట్ అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందిస్తాం’ అని ముఖేశ్ అంబానీ వెల్లడించారు. అందుకు జియో.కామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇక, చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500కే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

అంతేకాదు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే దిశగానూ అడుగులు వేస్తున్నామని ముఖేశ్ అంబానీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు. అటు.. భారత డిజిటల్ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు మైక్రోసాఫ్ట్‌తో జియో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకున్న సంగతి తెలిసిందే.

 
First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading