హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL: యూఎస్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ సెన్స్‌హాక్‌లో 79.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌.. వివరాలివే

RIL: యూఎస్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ సెన్స్‌హాక్‌లో 79.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) దీర్ఘకాల లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన సోలార్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సెన్స్‌హాక్ (SenseHawk) ఇంక్‌లో 79.4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) దీర్ఘకాల లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన సోలార్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సెన్స్‌హాక్ (SenseHawk) ఇంక్‌లో 79.4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Amban) ఒక ప్రకటన చేశారు. ‘సెన్స్‌హాక్ డైనమిక్ బృందాన్ని మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి RIL కట్టుబడి ఉంది. 2030 నాటికి 100 GW (గిగావాట్ల) సౌరశక్తిని ప్రారంభించాలనేది మా లక్ష్యం. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు సెన్స్‌హాక్‌ తోడ్పడుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పారు.

రూ.255.5 కోట్లతో ఒప్పందం

సెన్సహాక్‌, రిలయన్స్‌ మధ్య జరిగిన ఒప్పందం మొత్తం లావాదేవీ విలువ $32 మిలియన్లకు (సుమారు రూ.255.5 కోట్లు)గా రిలయన్స్‌ సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి. సెన్స్‌హాక్‌ సోలార్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సోలార్ అసెట్ లైఫ్‌సైకిల్స్ ఎండ్-టు-ఎండ్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుందని రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. న్యూ ఎనర్జీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఇతర పెట్టుబడులతో పాటు, సెన్స్‌హాక్ వినియోగదారులకు ప్రత్యేకమైన పరిష్కారాలను అందజేస్తుందని తెలిపింది.

Reliance JioFiber: జియో ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవుతో భూమిని 27 సార్లు చుట్టేయవచ్చు: ముఖేష్ అంబానీ

2022లోపు లావేదేవీలు పూర్తి

రెగ్యులేటరీ, ఇతర షరతులకు లోబడి 2022 సంవత్సరం పూర్తయ్యేలోపు లావాదేవీ పూర్తవుతుందని BSE ఫైలింగ్‌లో RIL తెలిపింది. సెన్స్‌హాక్‌ సహకారంతో, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుతుందని ముఖేష్‌ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్రాజెక్ట్‌ల కోసం అతి తక్కువ LCoEని అందించడానికి, సౌరశక్తిని విద్యుత్ వనరుగా మార్చడానికి ఆన్-టైమ్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు. RIL మద్దతుతో, సెన్సహాక్‌ అనేక రెట్లు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నట్లు అంబానీ పేర్కొన్నారు.

ప్లానింగ్‌ నుంచి ప్రొడక్షన్‌ వరకు సేవలు

సెన్స్‌హాక్‌ కంపెనీ 2018లో ప్రారంభమైంది. ఈ కంపెనీ సోలార్‌ ఎనర్జీ తయారీ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్ బేస్డ్ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. కంపెనీల ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, ఆటోమేషన్‌ను ఉపయోగించడం ద్వారా సౌర ప్రాజెక్టులను ప్లానింగ్ నుంచి ఉత్పత్తి వరకు వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

సెన్సహాక్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు స్వరూప్ మావనూర్ మాట్లాడుతూ..‘ రాహుల్ శంఖే, కార్తీక్ మేకలా, సాయిదీప్ తలారి, వైరల్ పటేల్, నేను సోలార్‌ లైఫ్‌ సైకిల్‌లో అన్ని ప్రక్రియల్లో కలిసి పని చేశాం. RIL పెట్టుబడి ద్వారా చూపిన విశ్వాసం చాలా సంతోషాన్ని ఇచ్చింది.’ అన్నారు. ఆర్థిక సంవత్సరం 2022, 2021, 2020లో సెన్స్‌హాక్‌ టర్నోవర్ వరుసగా $2,326,369, $1,165,92, $1,292,063గా ఉంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు