దేశంలో అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance Industries 44th AGM) అంగరంగ వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో AGM వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్లను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ సౌదీ అరామ్‌కో చైర్మన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్ రుమయ్యన్ స్వతంత్ర బోర్డు డైరెక్టర్‌గా కంపెనీ బోర్డులో చేరనున్నట్లు సగర్వంగా ప్రకటించారు. రుమయ్యన్ RIL బోర్డులో చేరడం కూడా రిలయన్స్ గ్లోబలైజేషన్ కు నాంది అని అంబానీ తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా చేరాలని సౌదీ అరామ్‌కో చైర్మన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్ రుమయ్యన్ సగర్వంగా ఆహ్వానిస్తున్నట్లు ముఖేస్ ప్రకటించారు. అంతేకాదు యాసిర్ ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్ , టెక్నాలజీ వ్యాపారాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉన్న సౌదీఅరాంకో, అలాగే ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో పనిచేసిన ఆయన అనుభవం నుండి తాము ఎంతో ప్రయోజనం పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాసిర్ రిలయన్స్ బోర్డులో చేరడం కూడా సంస్థ అంతర్జాతీయీకరణకు నాంది అని ప్రకటించారు. రాబోయే కాలంలో రిలయన్స్ అంతర్జాతీయ ప్రణాళికల గురించి మీరు మరింత వింటారు ”అని అంబానీ అన్నారు.
తన O2C (ఆయిల్-టు-కెమికల్స్) వ్యాపారంలో వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ అరామ్‌కోను స్వాగతించడానికి కంపెనీ ఎదురుచూస్తున్నట్లు అంబానీ తెలిపారు.
"ఈ సంవత్సరంలో అరాంకోతో మా భాగస్వామ్యం వేగవంతం అవుతుందని మేము ఆశిస్తున్నాము" అని ఆయన చెప్పారు.
ఈ మహమ్మారి సమయంలో సౌదీ అరాంకో, రిలయన్స్ మధ్య బలమైన సంబంధం ఏర్పడటం మార్పునకు నాంది అని అంబానీ తెలిపారు.
ఇదిలా ఉంటే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రెండు చమురు శుద్ధి కర్మాగారాలు , పెట్రోకెమికల్ ఆస్తులను కలిగి ఉన్న ఆయిల్-టు-కెమికల్స్ (ఓ 2 సి) వ్యాపారంలో తన 20 శాతం వాటాను అరామ్‌కోకు 15 బిలియన్ డాలర్లకు విక్రయించే ప్రణాళికను 2019 లో RIL ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance Industries, RIL