హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL AGM 2022 Highlights: జియో 5జీ నుంచి జియో క్లౌడ్ పీసీ వరకు... రిలయన్స్ 45వ ఏజీఎం హైలైట్స్ ఇవే

RIL AGM 2022 Highlights: జియో 5జీ నుంచి జియో క్లౌడ్ పీసీ వరకు... రిలయన్స్ 45వ ఏజీఎం హైలైట్స్ ఇవే

RIL AGM 2022 Highlights: జియో 5జీ నుంచి జియో క్లౌడ్ పీసీ వరకు... రిలయన్స్ 45వ ఏజీఎం హైలైట్స్ ఇవే

RIL AGM 2022 Highlights: జియో 5జీ నుంచి జియో క్లౌడ్ పీసీ వరకు... రిలయన్స్ 45వ ఏజీఎం హైలైట్స్ ఇవే

RIL AGM 2022 Highlights | జియో 5జీపై ప్రకటన వచ్చేసింది. జియో నుంచి క్లౌడ్ పీసీ కూడా రాబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ ఏజీఎం హైలైట్స్ గురించి తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. ఊహించినట్టుగానే జియో 5జీ ప్రకటన వచ్చేసింది. దీపావళి నుంచే జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani), రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఇషా అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ హైలైట్స్ ఏంటో తెలుసుకోండి.


Jio True 5G: జియో 5జీ సేవల ప్రారంభంపై ప్రకటన వచ్చేసింది. దీపావళికి జియో ట్రూ 5జీ సేవల్ని ప్రారంభిస్తామని ఆర్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ విస్తరించనుంది. 2023 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో జియో అన్ని పట్టణాలకు విస్తరిస్తుంది. జియో ట్రూ 5జీ నెట్వర్క్ విస్తరించేందుకు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతోంది జియో.


Maruti Swift CNG: డబ్బులు లేవా? అయినా ఈ కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు... నెలకు ఎంత చెల్లించాలంటే


Jio Cloud PC: రిలయన్స్ మరో సంచలనం సృష్టించోతోంది. జియో క్లౌడ్ పీసీని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పర్సనల్ కంప్యూటర్, ల్యాప్ టాప్‌ ప్రతిసారీ అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జియో క్లౌడ్ పీసీ వాడుకోవచ్చు. జియో ఫైబర్‌ను ఉపయోగించి క్లౌడ్‌లో వర్చువల్ పీసీని కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. విద్యార్ధులు, వ్యాపారులు, ఉద్యోగులు తక్కువ ధరకే పీసీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.


JioMart: మెటాతో కలిసి వాట్సప్ ద్వారా గ్రాసరీ సేవల్ని అందించనుంది జియో మార్ట్. వాట్సప్‌లో జియోమార్ట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వాట్సప్‌లో మొదటిసారి ఎండ్ టు ఎండ్ షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చు. కస్టమర్లు జియోమార్ట్ కేటలాగ్ బ్రౌజ్ చేసి ప్రొడక్ట్స్ యాడ్ చేసి వాట్సప్‌లోనే షాపింగ్ చేయొచ్చు. వాట్సప్‌లో జియోమార్ట్ సేవలు ఎలా లభిస్తాయో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఇషా అంబానీ వివరించారు.


New Rules in September: అలర్ట్... సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ఇవే


FMCG Business: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇషా అంబానీ ప్రకటించారు. భారతీయుల రోజువారీ అవసరాలను తీర్చే అధిక నాణ్యత, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, డెలివరీ చేయడం ఈ వ్యాపారం లక్ష్యమన్నారు.


Reliance Retail: రిలయన్స్ రిటైల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. గడిచిన సంవత్సరంలో రూ.12,000 కోట్లు ఆదాయంతో ఆసియాలోని టాప్ టెన్ రిటైలర్లలో కంపెనీ ఒకటిగా నిలిచింది. కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు FY22లో 4.5 బిలియన్ల మంది చూశారని ఇషా అంబానీ తెలిపారు.


IRCTC Shirdi Tour: సాయిభక్తులకు గుడ్ న్యూస్... విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ


Jio Institute: జియో ఇన్‌స్టిట్యూట్ ఈ సంవత్సరం అకడమిక్ సెషన్లను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం గత నెలలో 120 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌గా విస్తరించేందుకు నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్‌ను ప్రారంభిస్తాం అని ఇషా అంబానీ తెలిపారు.


Qualcomm: సెమీకండక్టర్, సాఫ్ట్‌వేర్ సేవల్ని అందించే క్వాల్కమ్‌తో రిలయన్స్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని జీవితంలోని అన్ని అంశాలలో డిజిటల్ పరివర్తనను అందించడానికి Jio మంచి స్థానంలో ఉందని Qualcomm CEO క్రిస్టియానో అమోన్ అన్నారు. 1,000 నగరాలకు చేరుకోవడం కోసం జియో ప్రణాళికలు ప్రతిష్టాత్మకమైనవని.. దాని అమలు సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని క్రిస్టియానో అమోన్ తెలిపారు.Jobs: ఉద్యోగాల కల్పనలో రిలయన్స్ కొత్త రికార్డును నెలకొల్పిందని ముకేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ రిటైల్ భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే సంస్థగా ఉందని, రిలయన్స్ ఎగుమతులు భారీగా పెరిగాయిని అన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Jio TRUE 5G, Reliance Industries, Reliance Jio, Reliance retail, RIL

ఉత్తమ కథలు