జియోలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియోలో గూగుల్ సంస్థ 7.7 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని ఆయన తెలిపారు. 43వ యానువల్ జనరల్ మీటింగ్‌లో ఈ మేరకు ప్రకటన చేశారు ముకేష్ అంబానీ. పలు అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులతో గత మూడు నెలల్లో రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించారు.
We are delighted to welcome @Google as a strategic investor in Jio Platforms. We have signed a binding partnership and an investment agreement under which Google will invest INR 33,737 crores for a 7.7% stake in Jio Platforms: Mukesh Ambani at #RILAGM #NayeIndiaKaNayaJosh #Jio
— Reliance Jio (@reliancejio) July 15, 2020
ఏప్రిల్ 22 నుంచి రిలయెన్స్ జియోలోకి పెట్టబడుల ప్రవాహం కొనసాగుతోంది. పలు దిగ్గజ కంపెనీలతో వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది జియో. ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ రెండుసార్లు, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్, ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ క్యాటర్టాన్, పీఐఎఫ్ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌తో డీల్స్ కుదుర్చుకున్నాయి.
రిలయన్స్‌కు ఇది ఫస్ట్ వర్చువల్ మీటింగ్ ఇది. దేశవ్యాప్తంగా 500ల ప్రాంతాల నుంచి లక్ష మంది షేర్ హోల్డర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జియో ఇటీవల లాంచ్ చేసిన జియో మీట్ ద్వారా ఈ వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే 50 లక్షల మంది జియో మీట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు ముకేష్ అంబానీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.