RIL AGM 2019: త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రిలయన్స్ జియో, రిటైల్ సంస్థలు...

జియో, రిటైల్ వ్యాపారాలపై అటు కస్టమర్లతో పాటు పలు ఆర్థిక సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఇక రిలయన్స్ రిటైల్ సంస్థ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 వేల పట్టణాల్లో విస్తరించిందని, అలాగే గత సంవత్సరమే రూ.1.30 లక్షల కోట్ల టర్నోవర్ దాటిందని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: August 12, 2019, 2:46 PM IST
RIL AGM 2019:  త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రిలయన్స్ జియో, రిటైల్ సంస్థలు...
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ
news18-telugu
Updated: August 12, 2019, 2:46 PM IST
రిలయన్స్ జియో, రిటైల్ వ్యాపారాలు రానున్న 5 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతాయని రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. 42వ ఏజీఎం భేటీలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ముఖ్యంగా రిటైల్, జియో వ్యాపారాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రానున్న కొద్ది  త్రైమాసికాల్లో వ్యాపార విస్తరణ చేస్తామని తెలిపారు. అంతే కాదు రియలన్స్ రిటైల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించడం ద్వారా ఒక బలమైన వినియోగదారులు బేస్ సంపాదించిందని పేర్కొన్నారు. దీంతో పాటు జియో, రిటైల్ వ్యాపారాలపై అటు కస్టమర్లతో పాటు పలు ఆర్థిక సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రిలయన్స్ రిటైల్ సంస్థ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 వేల పట్టణాల్లో విస్తరించిందని, అలాగే గత సంవత్సరమే రూ.1.30 లక్షల కోట్ల టర్నోవర్ దాటిందని ఆయన తెలిపారు. అంతే కాదు ప్రపంచంలోనే టాప్ 100 రిటైలర్స్ లో రిలయన్స్ రిటైల్ చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...