RIL AGM 2019: కేజీ బేసిన్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్, బీపీ...

ఆర్ఐఎల్, బ్రిటిష్ పెట్రోలియం కలిసి కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాల వెలికితీతకు రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ తెలిపారు.

news18-telugu
Updated: August 12, 2019, 3:21 PM IST
RIL AGM 2019: కేజీ బేసిన్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్, బీపీ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ
news18-telugu
Updated: August 12, 2019, 3:21 PM IST
దేశీయ వ్యాపార దిగ్గజం ఆర్ఐఎల్, బ్రిటిష్ పెట్రోలియం కలిసి కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాల వెలికితీతకు రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా బంగాళాఖాతంలోని కేజీ బేసిన్ బ్లాకులో మూడు సహజవాయు రిగ్గులను 2022 నాటికి  ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 42వ ఏజీఎం భేటీలో ఆయన మాట్లాడుతూ..కేజీ బేసిన్ లో ఏర్పాటు చేయనున్న ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా దేశంలోనే అతి పెద్ద సహజవాయు ఉత్పత్తి కేంద్రం అవతరించనుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జూలై మాసంలోనే ఇరు భాగస్వామ్య సంస్థల (ఆర్ఐఎల్, బీపీ) మధ్య జరిగిన భేటీలో కేజీ-డీ6 బ్లాకులో పెట్టుబడులపై ఒప్పందం కుదిరింది.

మూడు నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే రానున్న 2020-2022 నాటికి 1 బిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువు అందుబాటులోకి రానుంది. అలాగే మొత్తం 3 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువు వెలుగులోకి రానుంది. అయితే ఈ మొదటి దశ పనులు 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి కానున్నాయి.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...