రెడ్ లేబుల్ యాడ్ వివాదం: హిందుస్తాన్ యూనీలీవర్‌ను బహిష్కరించాలని డిమాండ్లు

కుంభమేళను వృద్ధుల్ని వదిలేసే ప్రాంతంగా చిత్రీకరించడంపై నెటిజన్లు మండిపడ్డారు. అంతే... హిందుస్తాన్ యూనీలీవర్ కంపెనీని నిషేధించాలంటూ #BoycottHindustanUnilever హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిసింది.

news18-telugu
Updated: March 7, 2019, 2:47 PM IST
రెడ్ లేబుల్ యాడ్ వివాదం: హిందుస్తాన్ యూనీలీవర్‌ను బహిష్కరించాలని డిమాండ్లు
రెడ్ లేబుల్ యాడ్ వివాదం: హిందుస్తాన్ యూనీలీవర్‌ను బహిష్కరించాలని డిమాండ్లు
news18-telugu
Updated: March 7, 2019, 2:47 PM IST
#BoycottHindustanUnilever... ఇటీవల ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో మొదలైన ఉద్యమం ఇది. హిందుస్తాన్ యూనీలీవర్‌ను బహిష్కరించాలని, ఆ కంపెనీ ఉత్పత్తుల్ని వాడొద్దన్నది ఆ ఉద్యమం సారాంశం. సర్ఫ్ ఎక్సెల్, లక్స్, క్వాలిటీ వాల్స్, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఉత్పత్తులతో ప్రతీ ఇంట్లోకి చేరిపోయిన హిందుస్తాన్ యూనీలీవర్‌‌ను బహిష్కరించాలన్న డిమాండ్ వెనుక ఓ యాడ్ కారణం. కుంభమేళలో రూపొందించిన యాడ్ ఇది. ఇందులో ఓ వ్యక్తి తన తండ్రిని వదిలించుకునేందుకు కుంభమేళకు తీసుకొస్తాడు. రద్దీలో తండ్రిని వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరో చోట మరో వ్యక్తి తన కొడుకు రద్దీలో తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చూసి చలించిపోతాడు. తన తండ్రి గుర్తొస్తాడు. దీంతో మళ్లీ తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. తండ్రీకొడుకులు కలిసి ఛాయ్ తాగుతారు. రెడ్ లేబుల్ కోసం రూపొందించిన యాడ్ ఇది. "కుంభమేళలో వృద్ధుల్ని ఇలాగే వదిలేస్తారు. మన పెద్దల్ని పట్టించుకోకపోవడం బాధాకరం. మీ హృదయాన్ని కలిగించే వీడియో చూడండి. కఠినమైన వాస్తవాలు కళ్లను తెరిపిస్తాయి." అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది హిందుస్తాన్ యూనీలీవర్. ఆ యాడ్ ఇదే.


మొదట ఈ వీడియోకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత కుంభమేళను వృద్ధుల్ని వదిలేసే ప్రాంతంగా చిత్రీకరించడంపై నెటిజన్లు మండిపడ్డారు. అంతే... హిందుస్తాన్ యూనీలీవర్ కంపెనీని నిషేధించాలంటూ #BoycottHindustanUnilever హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిసింది. యోగా గురు, పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కూడా ట్వీట్ చేశారు.














ఈ యాడ్ జనాల హృదయాలను కదిలిస్తుందనుకుంటే... వివాదాస్పదం కావడంతో ఒరిజినల్ ట్వీట్‌ను హిందుస్తాన్ యూనీలీవర్ డిలిట్ చేసింది. క్యాప్షన్ మార్చి వీడియోను మళ్లీ పోస్ట్ చేసింది.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇది కూడా చదవండి:

LIC Alert: మోసపోతారు జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎల్ఐసీ

Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి

SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...