ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) మోడల్స్‌కు మంచి గుర్తింపు ఉంది. క్లాసిక్, లగ్జరీ బైక్‌ల మ్యాన్యుఫ్యాకర్చరింగ్లో టాప్ ప్లేస్‌లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ భారత్‌లో సరికొత్త బైక్‌ను (bike) లాంచ్ చేయనుంది. గోవాలో జరిగిన రైడర్ మానియా-2022లో సూపర్ మీటోర్ 650 మోడల్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రదర్శించింది. ఈ క్రూయిజ్ సూపర్ మీటోర్ 650 బైక్‌ను ఇటలీలోని మిలన్లో ఇటీవల జరిగిన EICMA-2022లోనూ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రదర్శించింది. సూపర్ మీటోర్ 650 ధర వివరాలు 2023 జనవరిలో వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలోనే విక్రయాలు, డెలివరీలు ప్రారంభం కానున్నాయి. గోవాలో జరిగిన రైడర్ మానియా-2022లో సందర్శకులు రూ.10,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ప్రత్యేకంగా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు.
కలర్ ఆప్షన్స్
గోవాలో జరిగిన మెగా ఈవెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటోర్ 650ను రెండు వేరియంట్లలో ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి సూపర్ మీటోర్ 650 కాగా, మరోటి సూపర్ మీటోర్ 650 టూరర్. మొదటిది ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్స్టెల్లార్ గ్రే, ఇంటర్స్టెల్లార్ గ్రీన్ వంటి ఐదు పెయింట్ షేడ్స్‌లో లభించనుంది. రెండో వేరియంట్ సెలెస్టియల్ రెడ్, సెలెస్టియల్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానుంది.
Car Offers: ఈ 7 కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.వేలల్లో తగ్గింపు!
648cc ట్విన్ ఇంజిన్
సూపర్ మీటోర్ 650లో కంపెనీకి చెందిన ఇతర మోడళ్లలో వినియోగించిన ఇంజిన్నే ఉపయోగించారు. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 వేరియంట్లలో అందించిన 648cc ఎయిర్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ సూపర్ మీటోర్ 650లో కూడా ఉంటుంది. ఇది 47 bhp పవర్‌ను, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 241 కిలోల బరువు ఉండే ఈ వెహికల్, ఎన్ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలోని 650cc సిరీస్‌లో అత్యంత భారీ మోడల్‌గా నిలిచింది.
మల్టిపుల్ అడ్వాన్స్ ఫీచర్స్
బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ, సీటు ఎత్తు 740 మిమీగా ఉంటుంది. సూపర్ మీటోర్ 650 LED హెడ్‌లైట్, డ్యూయల్-ఛానల్ ABS, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ రూపంలో మల్టిపుల్ అడ్వాన్స్ ఫీచర్లతో లభించనుంది. స్మాల్ మెటియోర్ 350లో ఫుల్లీ-ఫీట్ ఫార్వర్డ్‌గా ఉండే ఫుట్ కంట్రోల్స్ ఇందులోనూ ఉండనున్నాయి. 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 16 అంగుళాల బ్యాక్ వీల్స్‌తో బైక్ రన్ అవుతుంది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లూజర్ రౌండ్ షేప్‌లో ఉంటుంది. 15.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో బైక్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుంది.
యాక్సెసరీస్ వివరాలు
ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్ మాదిరిగానే, సూపర్ మీటోర్ 650 కూడా ఇతర బైకుల నుంచి యాక్సెసరీస్ షేర్‌ను పొందుతోంది. సూపర్ మీటోర్ 650 టూరర్ యాక్సెసరీస్‌లో డీలక్స్ టూరింగ్ డ్యూయల్-సీట్, టూరింగ్ విండ్‌స్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, డీలక్స్ ఫుట్‌పెగ్స్, లాంగ్‌హాల్ ప్యానియర్స్, టూరింగ్ హ్యాండిల్‌బార్,LED ఇండికేట్స్ వంటివి ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్లోని యాక్సెసరీస్‌లో బార్ ఎండ్ మిర్రర్స్, డీలక్స్ ఫుట్‌పెగ్, సోలో ఫినిషర్, LED ఇండికేట్స్, మెషిన్డ్ వీల్స్ కీలకమైనవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Royal Enfield