RGICL: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని అవసరంగా భావిస్తున్నారు. చాలా మంది పనిచేసే కంపెనీల యాజమాన్యం అందించే కార్పొరేట్ పాలసీతో సరిపెట్టుకుంటున్నారు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చికిత్స ఖర్చులను కవర్ చేయడానికి బేసిక్ పాలసీ సరిపోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (RGICL) గురువారం ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ను లాంచ్ చేసింది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీ ద్వారా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
15పైగా యాడ్ ఆన్ బెనిఫిట్స్
రూ.5 కోట్ల వరకు కవరేజీ అందిస్తున్న ఈ పాలసీలో.. గ్లోబల్ కవర్, మెటర్నిటీ కవర్, OPD కవర్, బీమా చేసిన మొత్తాన్ని అపరిమితంగా పెంచుకునే ఆప్షన్, 15 పైగా ఉపయోగకరమైన యాడ్-ఆన్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు RGICL తెలిపింది. ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉన్నవారి ఈ పాలసీలో అదనపు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. క్రెడిట్ స్కోర్, బాడీ మాస్ ఇండెక్స్(BM) ద్వారా ప్రీమియంపై డిస్కౌంట్లు అందిస్తున్న ఇండియాలోని మొదటి పాలసీ అని వివరించింది. మోర్‌గ్లోబల్ కవర్ ఎయిర్ అంబులెన్స్, OPD సౌకర్యాలతో పాటు విదేశాలలో అత్యవసర, ప్లాన్డ్ మెడికల్ ట్రీట్‌మెంట్ అందిస్తుంది. యాడ్-ఆన్ బెనిఫిట్స్‌లో మెటర్నిటీ కవర్ 12 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో గరిష్టంగా రూ.2 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. అదే విధంగా పాలసీ ఇయర్‌లో సంబంధిత, సంబంధం లేని జబ్బులకు సంబంధించి బీమా చేసిన మొత్తాన్ని అపరిమితంగా రీస్టోర్ చేసుకొనే అవకాశం ఉంది. డాక్టర్‌ల కన్సల్టేషన్, డయాగ్నొస్టిక్ టెస్ట్‌లు, డెంటల్, సర్జికల్ ట్రీట్‌మెంట్స్, సూచించిన మందులకు OPD కవర్ అందిస్తోంది.
అదనపు ప్రయోజనాలు
కంపెనీ ఓ ప్రకటనలో.. 1వ రోజు నుంచి వర్తించే డబుల్ కవర్ వర్తిస్తుందని, దీని ద్వారా అదనంగా లభించే 100% బీమా సొమ్మును అదే క్లెయిమ్ సమయంలో ఉపయోగించాలని పేర్కొంది. సాధారణంగా ఇతర పాలసీలు కవర్ చేయని.. సిరంజి, గ్లోవ్స్ వంటి ఇతర ఖర్చులకు, వినియోగ వస్తువులకు కవర్ లభిస్తుందని, ఇవి మొత్తం ఆసుపత్రి ఖర్చులలో 8-10% ఉంటాయని తెలిపింది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ (PED) వెయిటింగ్ పీరియడ్‌లో కూడా అవసరమైన మార్పులు చేసినట్లు వివరించింది. స్పెసిఫిక్ ఇల్‌నెస్ వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి మార్చినట్లు తెలిపింది. ఇలాంటి మరెన్నో ప్రయోజనాలతో, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం బెనిఫిట్స్, లిమిట్‌లెస్ ప్రొటెక్షన్ అందిస్తోందని ప్రకటనలో వివరించింది.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్
ఈ పాలసీ పర్సనల్, ఫ్యామిలీ ఫ్లోటర్‌లో అందుబాటులో ఉంది. గరిష్టంగా 8 మంది సభ్యులు, కేటగిరీలను కవర్ చేస్తుంది. రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు మొత్తం ఇన్సూరెన్స్ ఆప్షన్‌లను అందిస్తుంది. 90 రోజుల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెద్దలు ఈ పాలసీని పొందవచ్చు. అదనంగా నవజాత శిశువులు మదర్ & చైల్డ్ కేర్ బెనిఫిట్ కింద కవర్ లభిస్తుంది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ బేసిక్ ప్లాన్.. అవయవ దానం, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, డే-కేర్ ప్రొసీజర్స్, అత్యవసర అంబులెన్స్, ప్రత్యేక చికిత్సలు వంటి క్లిష్టమైన ఖర్చులను కవర్ చేస్తుంది.ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్‌లు 10 శాతం డిస్కౌంట్ పొందుతారు.
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాకేష్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో బేసిక్ హెల్త్ పాలసీ సరిపోదని చెప్పారు. ద్రవ్యోల్బణం, ఆధునిక చికిత్సలకు పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీతో కస్టమర్‌లకు మెరుగైన రక్షణ, ప్రశాంతతను అందించేందుకు ప్రత్యేక ఫీచర్‌లను లాంచ్ చేసినట్లు చెప్పారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Health, Health Insurance, Insurance