• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • REVOLT MOTORS PAUSES BOOKINGS AMID DEMAND ITS FOR E BIKES NS GH

Revolte RV400: రెండు గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్.. రివోల్ట్ ఆర్వీ 400 ఈ-బైక్​కు విపరీతమైన డిమాండ్.. ఎందుకంటే?

Revolte RV400

ఆ​ర్​వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపింది. ఈ మోడల్ బుకింగ్​ను వీవోల్ట్ శుక్రవారం ప్రారంభించగా.. రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్​లన్నీబుక్ అయిపోవడం విశేషం.

  • Share this:
రివోల్ట్​ ఎలక్ట్రిక్​ బైక్​లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆ​ర్​వీ 400 మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపింది. ఈ మోడల్ బుకింగ్​ను వీవోల్ట్ శుక్రవారం ప్రారంభించగా.. రెండు గంటల్లోనే అమ్మకానికి పెట్టిన బైక్​లన్నీబుక్ అయిపోయాయి. దీంతో బుకింగ్​ను ఆపేసింది రివోల్ట్​. ఆర్​వీ 400 సేల్​కు చాలా మంచి స్పందన వచ్చిందని, ఒక్కరోజే రూ.50కోట్ల విలువైన బైక్​లకు బుకింగ్స్ వచ్చాయని వెల్లడించింది. ఎలక్ట్రిక్​ టూవీలర్స్​ అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సబ్సిడీలు ప్రకటించింది. దీంతో రివోల్ట్ ఆర్​వీ 400 బైక్​ ధరలు భారీ తగ్గాయి. ఈ బైక్​లకు డిమాండ్ విపరీతంగా పెరిగేందుకు ఇది ఓ కారణంగా ఉంది. సబ్సిడీలు లభించడంతో ఆర్​వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించింది. రూ.1,19,000 ధరకే బుకింగ్​కు పెట్టింది. దీంతో వినియోగదారులు పోటీపడి మరీ బుక్​ చేసుకోవడంతో రెండు గంటల్లోనే బుకింగ్స్ పూర్తయ్యాయి. “ఆర్​వీ 400 మోడల్​కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్​, హైదరాబాద్​లోని విక్రయదారుల నుంచి మంచి స్పందన వచ్చింది” అని రివోల్ట్ వెల్లడించింది.
Hyundai Alcazar: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ అల్కాజర్.. ధర, ఫీచర్ల వివరాలివే!
E-bike: సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్... ఎందుకు అందరికీ నచ్చుతోంది?

ఇప్పుడు రివోల్ట్​ ఆర్​వీ 400 మోడల్​ను బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది సెప్టెంబర్​లో డెలివరీ ఇవ్వాలని సంస్థ భావిస్తోంది. అలాగే భవిష్యత్తు డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని సైతం వేగవంతం చేయాలని రివోల్ట్ ప్రణాళికలు రచిస్తోంది. వినియోగదారుల ఆసక్తిని తెలుసుకునేందుకు సంస్థ అధికారిక వెబ్​సైట్​లో నోటిఫై మీ బటన్​ను యాడ్ చేసింది. దీని ద్వారా వచ్చే రిక్వెస్ట్​లను బట్టి డిమాండ్ తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మేలోనూ బుకింగ్స్ ఆహ్వానించిన రివోల్ట్ అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ స్పందన వచ్చిందని అప్పట్లో ప్రకటించింది. స్టాక్​ లేకపోవడంతో బుకింగ్స్​ను తాత్కాలికంగా నిలిపివేసింది.

రివోల్ట్ ఆర్​వీ 400 మోడల్​కు ఎనిమిది సంవత్సరాల వారెంటీ ఉండడం, ఇప్పటికే వినియోగిస్తున్న వారి నుంచి తక్కువ ఫిర్యాదులు వస్తుండడంతో ఈ మోడల్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్​ ఉండడం కూడా ఆకర్షిస్తోంది. అలాగే ఎలాంటి డౌన్​పేమెంట్ లేకుండా తక్కువ మొత్తాల ఈఎంఐలతోనే కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ఆర్​వీ 400 మోడల్​ కోసం చాలా మంది వేచిచూస్తున్నారు. 72వీ 3.24 కిలోవాట్స్​ లిథియన్​ ఇయాన్ బ్యాటరీతో కూడిన 3కిలోవాట్​ మోటార్​తో ఆర్​వీ 400 మోడల్ వస్తోంది. ఈ మోడల్ టాప్​ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్​, స్పోర్ట్స్​ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్​ ఇందులో ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published: