హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Regimes: ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా? కొత్త పన్ను విధానంలో ఇలా కట్టేశారనుకోండి చాలా లాభాలు.. ఓ లుక్కేయండి!

Tax Regimes: ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా? కొత్త పన్ను విధానంలో ఇలా కట్టేశారనుకోండి చాలా లాభాలు.. ఓ లుక్కేయండి!

కొత్త పన్ను విధానంలో ఇలా కట్టేశారనుకోండి  చాలా లాభాలు

కొత్త పన్ను విధానంలో ఇలా కట్టేశారనుకోండి చాలా లాభాలు

ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల కోసం రెండు ఆదాయ పన్ను విధానాలు (Tax Regimes) అందుబాటులో ఉన్నాయి. అవి పాత ఆదాయ పన్ను విధానం (old tax regime), కొత్త ఆదాయ పన్ను విధానం (new tax regime). ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసే ముందు, పన్ను విధానాల గురించి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి 2022 జులై 31లోపు ఐటీఆర్‌(ITR)ని ఫైల్ చేయాలి. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల కోసం రెండు ఆదాయ పన్ను విధానాలు (Tax Regimes) అందుబాటులో ఉన్నాయి. అవి పాత ఆదాయ పన్ను విధానం (old tax regime), కొత్త ఆదాయ పన్ను విధానం (new tax regime). ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసే ముందు, పన్ను విధానాల గురించి తెలుసుకుందాం..

పాత పన్ను విధానం

వ్యక్తుల పన్ను భారాన్ని తగ్గించడానికి పాత పన్ను విధానంలో 70కి పైగా డిడక్షన్స్‌, ఎగ్జమ్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. నిర్దిష్ట ఆర్థిక సాధనాలపై పెట్టుబడి పెట్టడం లేదా ఖర్చు చేయడం కోసం, పన్ను చెల్లింపుదారులు డిడక్షన్స్‌ క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C వివిధ పెట్టుబడుల కోసం పన్ను చెల్లింపుదారులకు సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలను పొందేందుకు, వ్యక్తులు ఆ మొత్తాన్ని అర్హత ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలి లేదా అదే ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న డిడక్షన్స్‌పై డబ్బును ఖర్చు చేయాలి. పెట్టుబడులలో ఉద్యోగుల భవిష్య నిధి (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ ఉన్నాయి. సర్టిఫికేట్ (NSC), బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఐదు సంవత్సరాల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి.

పన్ను చెల్లింపుదారులు ఇన్సూరెన్స్‌ ప్రీమియం కోసం రూ.25,000 వరకు డిడక్షన్‌ కూడా ఎంచుకోవచ్చు. ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తి 60 ఏళ్లు పైబడి ఉంటే, డిడక్షన్‌ రూ.50,000 వరకు పెరుగుతుంది. జీతం పొందే వ్యక్తి వారి జీతాల్లోని ఇంటి అద్దె అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్(LTA) వంటి వాటిపై ఎగ్జమ్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. పాత పన్ను విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇదీ చదవండి: Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?


కొత్త పన్ను విధానం

2020 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలో పాత విధానంతో పోలిస్తే ఎక్కువ పన్ను స్లాబ్‌లు, తక్కువ పన్ను రేట్లు ఉన్నాయి. అలాగే పాత పన్ను విధానం డిడక్షన్స్‌, ఎగ్జమ్షన్స్‌ తొలగించారు.

కొత్త పన్ను విధానంలో రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య వార్షిక ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తారు. అయితే సంవత్సరానికి రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదనపై 15 శాతం పన్ను విధిస్తారు. పాత విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20 శాతం పన్ను పరిధిలోకి వచ్చేవారు. అదేవిధంగా కొత్త పన్ను విధానంలో రూ.10 లక్షలకు పైబడిన ఆదాయాన్ని మూడు స్లాబ్‌లుగా విభజించారు - రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం పన్ను, అదే విధంగా రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం, రూ.15 లక్షల నుంచి అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేని డిడక్షన్స్‌, ఎగ్జమ్షన్స్‌ జాబితా ఇదే..

- లీవ్ ట్రావెల్ అలవెన్స్ లేదా LTA

- ఇంటి అద్దె భత్యం లేదా HRA

- వేతనాలు పొందే వ్యక్తులందరికీ, పెన్షనర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్

- రూల్ 2BB కింద ప్రత్యేక డిడక్షన్‌ అలవెన్స్‌(చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌, హాస్టల్ అలవెన్స్‌, ట్రావెల్‌ అలవెన్స్‌, పెర్‌ డైమ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్ మొదలైనవి)

- మైనర్ ఆదాయాన్ని కలపడానికి అలవెన్స్‌

- సెక్షన్ 10 AA ప్రకారం SEZ మినహాయింపు

- సెక్షన్ 16 ప్రకారం ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ అలవెన్స్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌

- సెక్షన్ 24 ప్రకారం ఇంటి ఆస్తి నష్టానికి దారితీసిన స్వీయ-ఆక్రమిత లేదా ఖాళీగా ఉన్న ఇంటి ఆస్తి కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీపై ట్యాక్స్‌ బెనిఫిట్‌

- సెక్షన్లు 32AD, 33AB, 33ABA కింద వివిధ డిడక్షన్స్‌

- సెక్షన్ 35 ప్రకారం శాస్త్రీయ పరిశోధనపై విరాళం లేదా ఖర్చు కోసం డిడక్షన్స్‌

- సెక్షన్ 35AD లేదా 35CCC కింద డిడక్షన్స్‌

- సెక్షన్ 57లోని క్లాజ్ (iIA) కింద కుటుంబ పెన్షన్ నుంచి రూ.15,000 డిడక్షన్‌

- అధ్యాయం VI-A కింద క్లెయిమ్ చేసే ట్యాక్స్‌ డిడక్షన్‌ (సెక్షన్ 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GIAG, 80GIAGGA, , 80-IB, 80-IBA మొదలైనవి)

సెక్షన్ 80CCD (నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగి ఖాతాలో యజమాని సహకారం- ఎక్కువగా NPS) సబ్-సెక్షన్ (2) కింద డిడక్షన్‌, సెక్షన్ 80JJAA (కొత్త ఉపాధి కోసం) క్లెయిమ్ చేయవచ్చని పేర్కొనాలి

- సెక్షన్ 80TTA లేదా 80 TTB కింద డిడక్షన్స్‌

పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో ఏది ఎంచుకోవచ్చు?

జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లు తమ సౌలభ్యం ప్రకారం ప్రతి అసెస్‌మెంట్ సంవత్సరంలో పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య సెలక్ట్‌ చేసుకోవచ్చు. అయితే, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయాన్ని కలిగి ఉన్న వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండు పన్ను విధానాల మధ్య ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండదు.

ఏది ఎంచుకోవాలి?

కొత్త పన్ను విధానం వెనుక ఉన్న హేతుబద్ధతను వివరిస్తూ, డెలాయిట్ భాగస్వామి ఆర్తీ రౌటే మాట్లాడుతూ..‘పన్ను చెల్లింపుదారులకు తక్కువ పన్నులను అందించడానికి కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. అదే సమయంలో HRA, LTA, స్టాండర్డ్ డిడక్షన్, 80C వంటి కొన్ని డిడక్షన్స్‌ లేదా ఎగ్జమ్షన్స్‌ తిరస్కరించారు. ఇలాంటి డిడక్షన్స్‌ పొందలేని వ్యక్తులు కొత్త పన్ను విధానం సెలక్ట్‌ చేసుకోవచ్చు.’ అని చెప్పారు.

పన్ను విధానాన్ని ఎంచుకునే ముందు పన్ను భారాన్ని లెక్కించడం ముఖ్యం. పన్ను ప్రణాళిక సమీపిస్తున్నప్పుడు, ఇప్పటికే ఎంత పన్నులు ఆదా చేశారో నిర్ధారించుకోవాలని Taxbuddy.com వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ సూచించారు. పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా రెండు విధానాల కింద పన్నులను లెక్కించాలి. ఏది బాగా పని చేస్తుందో ప్రతి అసెస్‌మెంట్‌ ఇయర్‌లో సరి చూసుకోవాలి.

First published:

Tags: Epf, Hra, IT Returns, Tax deduction

ఉత్తమ కథలు