నెలకు రూ.4వేలు జమచేయండి.. 20 ఏళ్ల తర్వాత నెలకు రూ.25వేల చొప్పున 20 ఏళ్లు పొందండి

SIP: నెలకు రూ.4వేలు జమచేయండి.. 20 ఏళ్ల తర్వాత నెలకు రూ.25వేల చొప్పున 20 ఏళ్లు పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

SIP: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇదో రకమైన ఫండ్. దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ మంచి రిటర్న్స్ ఉంటాయి. దీన్ని ఎలా నిర్వహించాలో... ఎలా నెలకు రూ.25,000 పొందాలో తెలుసుకుందాం.

 • Share this:
  SIP: మన దగ్గర ఉన్న డబ్బును సేవ్ చేయించి... భవిష్యత్తులో ఉపయోగపడేలా చెయ్యడానికి ఇండియాలో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ ఆశ్రయిస్తున్నారు. అందులోనూ SIP బాగా కలిసొస్తుంటే... అందులో ఉన్న ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. మీరు ఉద్యోగి అయితే... చాలా త్వరగానే రిటైర్మెంట్ పొందేందుకు మీరు ప్లాన్ వేసుకోవచ్చు. పెరుగుతున్న ధరలను లెక్కలోకి తీసుకొని... రిటైర్మెంట్ నాటికి మీకు నెలకు ఎంత డబ్బు అవసరమో అంచనా వేసుకోవాలి. ఇందుకోసం ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), దీనికి తోడుగా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ఉంటుంది. అవేంటో చూద్దాం.

  రిటైర్మెంట్ ప్లాన్ అనేది సుదీర్ఘ కాలం ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్లు కనీసం 20 నుంచి 25 ఏళ్ల పాటూ నెలవారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడాలి. ఎంత రిటర్న్స్ వస్తాయి అనేదానిపై మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. కొన్నైతే... పెట్టిన పెట్టుబడికి పది శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి.

  First SIP, then SWP:
  ముందుగా మీరు 20 ఏళ్లపాటూ పెట్టుబడి పెట్టేలా సిప్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో 20 ఏళ్లపాటూ SWP ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ రకంగా.. పెట్టుబడికి 10 శాతం రిటర్న్ లెక్కలోకి తీసుకుంటూ... మొదటి 20 ఏళ్లు, తర్వాతి 20 ఏళ్లను లెక్కవేసుకోవాలి.

  ఇది కూడా చదవండి:


  SWP ద్వారా ఇన్వెస్టర్లు... నెల నెలా కొంత మొత్తం వెనక్కి తీసుకోగలరు. ఎంత విత్‌డ్రా చేసుకోవాలో, ఎన్నిసార్లు చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. అంటే రోజు, వారం, నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి అలా వెనక్కి తీసుకోవచ్చు. చాలా మంది నెలవారీ తీసుకుంటారు.

  SIP in first 20 years:
  సిప్‌లో భాగంగా నెలకు రూ.4,000 చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇలా 20 ఏళ్లపాటు పెట్టాలి. రిటర్న్ 10 శాతం అనుకుంటే... 20 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ.9,60,000 అవుతుంది. రిటర్నుతో కలిపి... సిప్ విలువ రూ.30,62,788 అవుతుంది.

  SWP for next 20 years: ఇప్పుడు SWP ప్రకారం మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. మీ మొత్తం డబ్బు రూ.30,62,788 అవుతుంది. దానికి సంవత్సరానికి 10 శాతం చొప్పున రిటర్న్ వస్తుంది అనుకోవచ్చు. అంటే సంవత్సరానికి మీకు రూ.3లక్షల 6వేలు వస్తుంది. దాన్ని మీరు నెలవారీ చూస్తే... నెలకు రూ.25,500 పొందవచ్చు.

  ఇది కూడా చదవండి:


  SWP Regular Income Options: రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడిపేందుకూ... నెలవారీ ఇబ్బంది లేకుండా మనీ వచ్చేందుకు SWP అనేది మంచి ఆప్షన్. మీరు మొదటి పెట్టుబడి పెట్టాక... ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని మీరు స్టార్ట్ చేసుకుంటే... ఇది మీకు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్‌కం ఇస్తుంది. మీ పెట్టుబడి అమౌంట్ అలాగే ఉంటూ... నెలవారీ డబ్బు పొందగలరు.

  (Disclaimer: The material provided on this page is for information purposes only. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com. We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
  Published by:Krishna Kumar N
  First published: