లైఫ్ ఇన్సూరెన్స్‌తో పాటు రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధులు అందించే ప్లాన్‌లకు ఇటీవల ఆదరణ పెరిగింది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థ ఈ విభాగానికి చెందిన సరికొత్త పాలసీని ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ (HDFC Life Systematic Retirement Plan) పేరుతో ఈ పాలసీని ఆవిష్కరించింది. దీని ద్వారా పెట్టుబడిదారులు పదవీ విరమణ తర్వాత జీవన వ్యయాల కోసం కార్పస్ పొందవచ్చు.
ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్/గ్రూప్ సేవింగ్స్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. పాలసీ ప్రారంభంలో కస్టమర్లు యాన్యుటీ వడ్డీ రేట్లను లాక్ చేయవచ్చు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన యాన్యుటీలు పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే పాలసీదారులు మరణించిన సందర్భంలో మొత్తం ప్రీమియంను స్వీకరించే ఆప్షన్ కూడా ఉంది.
HDFC లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ ఫీచర్లు..
- ఈ ప్లాన్ ద్వారా 5- 15 సంవత్సరాల మధ్య ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు 15 సంవత్సరాల వరకు వాయిదా వ్యవధిని (deferment period) ఎంచుకోవచ్చు.
- మెడికల్స్, అండర్ రైటింగ్ అవసరాలు లేకుండా 24 గంటల్లోనే పాలసీని జారీ చేస్తారు. చాట్ ద్వారా అవసరమైన డాక్యుమెంటేషన్, ప్రీ-కన్వర్షన్ వెరిఫికేషన్ పూర్తిచేసుకోవచ్చు.
- ఈ పాలసీ కింద పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించడం ద్వారా కస్టమర్ జీవితాంతం హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చు. అయితే హామీ ఇచ్చిన మొత్తం అనేది చెల్లించిన ప్రీమియంపై ఆధారపడి.. నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది. - పాలసీ ప్రారంభంలో అంగీకరించిన యాన్యుటీ వడ్డీ రేటు పాలసీ వ్యవధి వరకు మారదు.
- పాలసీ అందించే ‘సేవ్ ది డేట్’ ఫీచర్‌తో కస్టమర్లు ఏదైనా పే-అవుట్ తేదీని ఎంచుకోవచ్చు.
- డెఫర్‌మెంట్ పీరియడ్‌లో పాలసీదారులు చనిపోతే, యాన్యుటెంట్‌కు చెల్లించే డెత్ బెనిఫిట్స్ అనేవి.. చెల్లించిన మొత్తం ప్రీమియంపై సంవత్సరానికి 6 శాతం కాంపౌండ్ వడ్డీ లేదా చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105 శాతంలో ఏది ఎక్కువైతే అంత మొత్తంగా ఉంటుంది.
- పాలసీలోని లైఫ్ యాన్యుటీ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. డెఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత కస్టమర్ మరణించిన సందర్భంలో ఎటువంటి డెత్ బెనిఫిట్స్ వర్తించవు. యాన్యుటెంట్ మరణించిన తర్వాత పాలసీ రద్దు అవుతుంది. అన్ని ఇతర ప్రయోజనాలు కూడా నిలిచిపోతాయి. లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ఆప్షన్ విషయంలో డెత్ బెనిఫిట్ అనేది.. కస్టమర్ మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలపై 6 శాతం కాంపౌండ్ వడ్డీ లేదా మొత్తం ప్రీమియంలపై 105 శాతం.. ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
HDFC లైఫ్ సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ అర్హత45 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఏ వ్యక్తి అయినా పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. పాలసీ డెఫర్‌మెంట్ పీరియడ్ 15 సంవత్సరాల వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్‌తో ప్రారంభమవుతుంది.
ఇన్‌స్టాల్‌మెంట్‌కు మినిమం యాన్యుటీ పేఅవుట్ నెలకు రూ. 1000 నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్లు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా సంవత్సరం గడువుతో బెనిఫిట్స్ రిసీవ్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. గ్రూప్ పాలసీ కోసం కనీసం 10 మంది వ్యక్తులు పార్టిసిపెంట్స్‌గా ఉండాలి. గరిష్ట మెంబర్‌షిప్‌కు ఎలాంటి పరిమితి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.